ట్విటర్‌ వేదికగా విజయసాయి రెడ్డి సెటైర్స్‌

15 Jul, 2019 12:28 IST|Sakshi

సాక్షి, అమరావతి : రూ. 2 వేల కంటే రూ. 15 వేలు తక్కువని చంద్రబాబు చెబితే నమ్మాలి.. లేదంటే ధర్నాలు చేయిస్తారట అని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పక్షనేత విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు. సోమవారం ట్విటర్‌ వేదికగా ఆయన చంద్రబాబుపై విమర్శలు చేశారు. ‘ఎన్నికల ముందు చంద్రబాబు ప్రవేశపెట్టిన ఇంటర్‌ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఖర్చు ఏడాదికి రూ. 2 వేలు మాత్రమే. అయితే విద్యార్థులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భోజనానికి బదులుగా ఏడాదికి రూ. 15 వేలు ఇస్తామంటే చంద్రబాబు దారుణం అంటున్నారు. కాదంటే ధర్నాలు చేయిస్తారంట’ అని విజయసాయి రెడ్డి వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు.

ఇక సోమవారం రాజ్యసభలో జీరో అవర్‌లో విజయసాయి రెడ్డి పాకిస్తాన్‌ జైలులో ఉన్న ఏపీ జాలర్లకు విముక్తి కల్పించండని కేంద్రాన్ని కోరారు. పాక్‌ జైలులో మగ్గుతున్న శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన 28 మంది జాలర్లకు విముక్తి కలిగించేందుకు తక్షణం చర్యలు తీసుకోవాలని విజయసాయి రెడ్డి రాజ్యసభలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది.

మరిన్ని వార్తలు