రాజన్న సన్నిధిలో లఘు దర్శనమే

21 Jan, 2018 17:45 IST|Sakshi

సాక్షి, వేములవాడ: ఈనెల 31నుంచి ప్రారంభం కానున్న సమ్మక్క జాతరకు వెళ్లే భక్తులు ముందుగా ఎములాడ రాజన్నకు మొక్కులు చెల్లించుకునే సంప్రదాయం ఉంది. ఈ క్రమంలో ఆదివారం 50వేల మందిపైగా భక్తులు తరలివచ్చారు. దీంతో రాజన్న క్షేత్రం కిటకిటలాడింది. భక్తుల రద్దీని గమనించిన ఆలయ అధికారులు ఆర్జిత సేవలను రద్దు చేసి లఘు దర్శనాలకు మాత్రమే అనుమతించారు. రద్దీ మరింత పెరుగుతుండడంతో రాత్రంతా దర్శనాలను కొనసాగించనున్నట్లు మైక్‌ ద్వారా ప్రకటించారు. సోమవారం వీఐపీ దర్శనాలను బ్రేక్‌ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. భక్తులు తలనీలాలు, కోడె మొక్కులు, ఇతర మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం బద్ది పోశవ్వకు బోనాల మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల ద్వారా రూ.38 లక్షల ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. 

Appearances before the short RAJANNA

మరిన్ని వార్తలు