సందేశాత్మకం... హెబ్బెట్టు రామక్క

14 Apr, 2018 13:41 IST|Sakshi
హెబ్బెట్టు రామక్క నటి తారా, హెబ్బెట్టు రామక్క పోస్టర్‌

కన్నడ సినిమాలకురెండు అవార్డులు

ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా హెబ్బెట్టు రామక్క

ఉత్తమ పాటల రచయితగా ముత్తురత్న

బనశంకరి: జాతీయ చలనచిత్ర అవార్డుల్లో కర్ణాటక సినిమాలు మెరిశాయి. ఉత్తమ ప్రాంతీయ చిత్రం, ఉత్తమ పాటల రచయిత విభాగాల్లో రాష్ట్రానికి అవార్డులు వరించాయి. శుక్రవారం న్యూఢిల్లీలో 65వ జాతీయ చలనచిత్ర అవార్డులను జ్యూరీ సభ్యులు ప్రకటించారు. కన్నడలో నంజుండేగౌడ దర్శకత్వంలో హెబ్బెట్టు రామక్క సినిమా అత్యుత్తమ కన్నడ సినిమా పురస్కారానికి ఎంపికైంది. తారా, దేవరాజ్‌సన్ని, సురేష్‌ చంద్ర, నాగరాజమూర్తి తదితరులు ప్రధాన తారాగణంతో రూపొందించిన ఈ సినిమా సామాజిక సమస్యపై తెరకెక్కించారు.

ఉత్తమ పాటల రచయితగా ముత్తురత్న..
కూడ్లు రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘మార్చి 22’ సినిమాకు ఉత్తమ పాటల రచయితగా ముత్తురత్న పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ చిత్రం నీటి సమస్య గు రించి తమదైనశైలిలో తెరకెక్కించారు. ఇక మామ్‌ సినిమా నటన కు దివంగత శ్రీదేవి అత్యుత్తమ నటి పురస్కారానికి ఎంపికైంది. 

చిత్రబృందానికి దక్కిన గౌరవం
హసీనా సినిమా అనంతరం తన నటకు హెబ్బెట్టు రామక్క సినిమాకు జాతీయ అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉందని అత్యుత్తమ నటి పురస్కారం వస్తుందని ఆశాభావం ఉండేది. కానీ హెబ్బెట్టు రామక్కకు అత్యుత్తమ చిత్రం పురస్కారం దక్కడం చిత్రబందానికి శ్రమకు  తగిన పలితమని హెబ్బెట్టురామక్కలో చిత్రంలో నటించినæ తారా అన్నారు.

మరిన్ని వార్తలు