ఇండియన్‌ సినిమానే తిరిగి చూస్తుంది

26 Apr, 2018 08:50 IST|Sakshi

తమిళసినిమా: తమిళసినిమాను ఇండియన్‌ సినిమానే తిరిగి చూస్తుందని నటుడు, నిర్మాతలమండలి అధ్యక్షుడు విశాల్‌ పేర్కొన్నారు. బాఫ్టా మీడియా వర్క్స్‌ సమర్పణలో క్రియేటివ్‌ మీడియా ఎంటర్‌టెయిన్‌మెంట్స్‌ పతాకంపై ధనుం జయన్‌ నిర్మించిన చిత్రం మిస్టర్‌ చంద్రమౌళి. సీనియర్‌ నటుడు కార్తీక్, ఆయన కొడుకు గౌతమ్‌కార్తీక్‌ కలిసి నటించిన క్రేజీ చిత్రం ఇది. నటి రెజీనా హీరోయిన్‌గా నటించిన ఇందులో నటి వరలక్ష్మీ కీలక పాత్రను పోషించారు. సీనియర్‌ దర్శకుడు మహేంద్రన్, అగస్త్యన్, సతీశ్‌ ముఖ్య పాత్రలను పోషించారు. తిరు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి శ్యామ్‌.సీఎస్‌ సంగీతాన్ని అందించారు. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం ఉదయం స్థానిక సత్యం థియేటర్‌లో ఘనంగా జరిగింది. ఇందులో విశాల్‌ పాల్గొన్నారు. విశేషం ఏమిటంటే ఈ చిత్రం ద్వారా నటుడు శివకుమార్‌ కూతురు బృందా గాయనిగా పరిచయం అవుతున్నారు.

నా సోదరి కలను నెరవేర్చారు
ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న నటుడు సూర్య మాట్లాడుతూ కార్తీక్‌ నటించిన చిత్రాలు చూసి లవ్‌ చేయడం ఎలా అన్నది నేర్చుకున్నామన్నారు.  నటుడు కార్తీక్‌ మాట్లాడుతూ ఈ చిత్రంలో నటించడం చాలా గొప్ప అనుభవం అని పేర్కొన్నారు. నటుడు విశాల్‌ మాట్లాడుతూ చిత్రపరిశ్రమ సమ్మెకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు అని పేర్కొన్నారు. మరో 6 నెలల్లో తమిళ సినిమా భారతీయ సినిమానే తిరిగి చూసేలా ఉంటుందని అన్నారు. నటి వరలక్ష్మీశరత్‌కుమార్, విశాల్‌ పక్కపక్కనే కూర్చోవడం ఫొటోగ్రాఫర్లకు పండగే అయ్యింది.

మరిన్ని వార్తలు