టీ20ల్లో వరుసగా 11వ విజయం

12 Nov, 2018 12:44 IST|Sakshi

గయానా: ఒకవైపు ఆస్ట్రేలియా పురుషుల క్రికెట్‌ జట్టు విజయాల కోసం ఆపసోపాలు పడుతుంటే, ఆ దేశ మహిళల జట్టు మాత్రం వరుస విజయాలతో దూసుకుపోతోంది. మహిళల వరల్డ్‌ టీ20లో భాగంగా ఆదివారం అర్ధరాత్రి(భారతకాలమాన ప్రకారం) ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్‌ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఐర్లాండ్‌ నిర్దేశించిన 94 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్‌ మహిళలు 9.1 ఓవర్లలో వికెట్‌ మాత్రమే కోల్పోయి ఛేదించారు. అలైస్సా హీలే(56 నాటౌట్‌) విజయంలో కీలక పాత్ర పోషించారు.

ఈ గెలుపుతో టీ20ల్లో ఆసీస్‌ మహిళలు వరుసగా 11వ విజయాన్ని రుచిచూశారు. ఫలితంగా వరుసగా పది, అంతకంటే ఎక్కువ విజయాల్ని ఆసీస్‌ మహిళలు రెండోసారి సాధించినట్లయ్యింది. 2014లో ఆసీస్‌ మహిళలు వరుసగా 16 విజయాలు సాధించిన సంగతి తెలిసిందే. దాంతో అత్యధిక వరుస విజయాల్ని సాధించిన ఘనతను సైతం తన పేరిట లిఖించుకుంది. ఇప్పుడు అదే జోరును కొనసాగిస్తున్న ఆసీస్‌ మహిళలు వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. మహిళల టీ20 క్రికెట్‌లో అత్యధిక వరుస విజయాలు సాధించిన జాబితాలో ఇంగ్లండ్‌(14) రెండో స్థానంలో ఉండగా, న్యూజిలాండ్‌(12) మూడో స్థానంలో కొనసాగుతోంది.

మరిన్ని వార్తలు