క్రికెట్‌కు బద్రీనాథ్‌ గుడ్‌బై

1 Sep, 2018 10:46 IST|Sakshi

చెన్నై: టీమిండియా మాజీ ఆటగాడు ఎస్‌ బద్రీనాథ్‌ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌లకు శుక్రవారం రిటైర్మెంట్‌ ప్రకటించాడు. తమిళనాడుకు చెందిన 38 ఏళ్ల ఈ మిడిల్డార్‌ బ్యాట్స్‌మన్‌ బద్రీనాథ్‌ రెండు టెస్ట్‌లు, ఏడు వన్డేలు, ఓ టీ-20లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 145 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ల్లో 54.49 సగటుతో 10,245 పరుగులు చేశాడు. ఇందులో 32 సెంచరీలున్నాయి. బద్రీనాథ్‌ రంజీల్లో హైదరాబాద్‌, విదర్భలకు కూడా ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ఆడాడు.

దాదాపు ఏడేళ్ల క్రితం భారత్‌ తరపున చివరి మ్యాచ్‌ ఆడిన బద్రీనాథ్‌.. ఇక క్రికెట్‌కు దూరంగా ఉండేందుకు ఇదే సరైన సమయం అని భావించి రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ప్రధానంగా కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేందుకు క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు చెబుతున్నట్లు స్పష్టం చేశాడు. తన ఫస్ట్‌ క్లాస్‌ కెరీర్‌లో 2010-11 సీజన్‌ అత్యుత్తమంగా బద్రీనాథ్‌ పేర్కొన్నాడు. ఆ సమయంలోనే అత్యధిక శతకాలు సాధించిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు.

మరిన్ని వార్తలు