‘ప్లాన్‌-బితోనే క్రికెట్‌లోకి వచ్చా’

12 Jun, 2020 13:58 IST|Sakshi
మత్తయ్య మురళీధరన్‌

ఏదొక టాలెంట్‌ సరిపోదు: మురళీ ధరన్‌

కొలంబో: ప్రపంచ టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు సాధించిన ఘనత శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌ పేరిట ఉన్న సంగతి తెలిసిందే. తన టెస్టు కెరీర్‌లో 800 వికెట్లను ఖాతాలో వేసుకున్న మురళీధరన్‌ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. తన ఆఫ్‌ బ్రేక్‌తో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించడంలో మురళీధరన్‌తో ప్రత్యేకమైన శైలి. అయితే తన యాక్షన్‌పై అనేకసార్లు వార్తల్లో నిలిచిన మురళీధరన్‌..ఎప్పటికప్పుటూ ఐసీసీ గ్రీన్‌ సిగ్నల్‌ పొందుతూనే అరుదైన రికార్డును సాధించడం ఇక్కడ విశేషం. 1998-99 సీజన్‌ ఆస్ట్రేలియాతో సిరీస్‌లో మురళీధరన్‌ యాక్షన్‌పై అనుమానం వ్యక్తం చేసిన అంపైర్‌ రాస్‌ ఎమెర్సన్‌ వరుసగా నో బాల్స్‌ ఇవ్వడం అప్పట్లో పెద్ద దుమారం రేపింది. మురళీ బంతిని సంధించడం అంపైర్‌ నోబాల్‌ ఇవ్వడం హాట్ టాపిక్‌ అయ్యింది. అయినప్పటికీ తన యాక్షన్‌లో ఎటువంటి లోపం లేదని నిరూపించుకున్న ఈ స్పిన్‌ మాంత్రికుడు టెస్టు ఫార్మాట్‌ అత్యధిక వికెట్ల టేకర్‌గా ఇప్పటికీ కొనసాగుతున్నాడు. (వారిద్దరూ ఇంగ్లండ్‌ టూర్‌కు డుమ్మా)

అయితే తాను అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన సమయంలో ఆఫ్‌ బ్రేక్‌ బౌలింగ్‌ సెట్‌ కాకపోయి ఉంటే లెగ్‌ స్పిన్‌ బౌలర్‌గా అవతరించేవాడినన్నాడు. తాను మణికట్టు స్పిన్‌ను కూడా ప్రాక్టీస్‌ చేసి ప్లాన్‌-బిని సిద్ధంగా ఉంచుకున్న విషయాన్ని తెలిపాడు. ‘ నేను యువకుడిగా ఉన్నప్పడు లెగ్‌ స్పిన్‌ కూడా ప్రాక్టీస్‌ చేస్తూ ఉండేవాడిని. ఆఫ్‌ బ్రేక్‌ బౌలర్‌గా టెస్టుల్లో సెట్‌ కాకపోతే పరిస్థితి ఏంటి అనే దాని కోసం లెగ్‌ స్పిన్‌ను ప్రాక్టీస్ చేసేవాడిని. ఒకవేళ టెస్టుల్లో ఆఫ్‌ స్పిన్నర్‌గా కొనసాగిన నేను అది వర్క్‌ కాకపోయి ఉంటే కచ్చితంగా లెగ్‌ స్పిన్నర్‌ను అయ్యేవాడిని’ అని తెలిపాడు. ఎవరైనా ఎప్పుడైతే క్రికెట్‌లోకి రావాలనుకుంటారో ప్లాన్‌-ఏ, ప్లాన్‌-బిలు సిద్ధంగా ఉండాలన్నాడు. ఏదొక దానికే మాత్రమే కట్టుబడి ఉంటే అది వర్కౌట్‌ కాకపోతే సమస్యలు వస్తాయన్నాడు. ప్రొఫెషనల్‌ స్థాయిలో ఒక గేమ్‌ను ఆడాలంటే మానసిక ఒత్తిడిని అధిగమించాల్సి ఉంటుందన్నాడు. ఇది కేవలం క్రికెట్‌ మాత్రమే పరిమితం కాదని, అన్ని క్రీడలకు వర్తిస్తుందన్నాడు. మానసిక బలమే ఆటలో కీలక పాత్ర పోషిస్తుందని మురళీ చెప్పుకొచ్చాడు.(‘మాపై ప్రయోగం చేయడం లేదు’ )

మరిన్ని వార్తలు