చాంప్స్ వరుణ్, సేవిత

13 Oct, 2014 01:38 IST|Sakshi
చాంప్స్ వరుణ్, సేవిత

బ్రిలియంట్ ట్రోఫీ చెస్


 సాక్షి, హైదరాబాద్: బ్రిలియంట్ చెస్ టోర్నీ ఓపెన్ కేటగిరీ విభాగంలో వి. వరుణ్ విజేతగా నిలిచాడు. 6 రౌండ్ల ద్వారా అతను  5.5 పాయింట్లు స్కోర్ చేశాడు. చెరో 5 పాయింట్లు సాధించిన ఎంవై రాజు, విశ్వనాథ్ శాండిల్య రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. జూనియర్ కేటగిరీలో సాధువస్వాని ఇంటర్నేషనల్ స్కూల్‌కు చెందిన సేవిత విజు ట్రోఫీని గెలుచుకుంది. 6 రౌండ్లలో సేవిత 5.5 పాయింట్లు సాధించింది. సాయి అమిత్ (5), రుత్విక్ పొన్నపల్లి (5)లకు రెండు, మూడు స్థానాలు దక్కాయి.
 ఓపెన్ కేటగిరీ ఫలితాలు: 1. వి.వరుణ్, 2. ఎంవై రాజు, 3. విశ్వనాథ్ శాండిల్య, 4. ఎస్వీసీ చక్రవర్తి, 5. ఎస్.ఖాన్, 6. ఎన్. రామ్మోహనరావు, 7. టి.రమణ్ కుమార్, 8. మురళీమోహన్, 9. వీఎస్‌ఎన్ మూర్తి, 10. ఎన్‌సీ రామ్.
 
 వివిధ వయో విభాగపు కేటగిరీ ఫలితాలు:
 (బాలురు) అండర్-14:  1. తరుణ్, 2. ముదబ్బిర్; అండర్-12: 1. సాయి అమిత్, 2. జయంత్; అండర్-10: 1. రుత్విక్, 2. పి. సాయిరోహన్; అండర్-8: 1. రోహిత్ యాదవ్, 2. సాకేత్ కుమార్; అండర్-6: ఎస్. ప్రణయ్, 2. అమోఘ్
 (బాలికలు) అండర్-10: 1. హన్సిక; అండర్-8: 1. రచిత, 2. జావళి; అండర్-6: 1. నిగమశ్రీ, 2. హాసిని;  ఉత్తమ మహిళా క్రీడాకారిణి: లాస్యప్రియ, ఉత్తమ వెటరన్ క్రీడాకారుడు: పీవీ దుర్గాప్రసాద్ 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా