ఎట్టకేలకు గేల్‌కు చోటు

15 Apr, 2018 19:53 IST|Sakshi

మొహాలి: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా ఇక్కడ ఆదివారం పంజాబ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఐఎస్‌ బింద్రా స్టేడియంలో కింగ్స్‌ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన చెన్నై సూపర్‌కింగ్స్‌ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని.. పంజాబ్‌ను ముందుగా బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.

ఇప్పటివరకూ చెన్నై ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించగా, కింగ్స్‌ పంజాబ్‌ రెండు మ్యాచ్‌ల్లో ఒకటి గెలిచి, మరొకటి ఓడింది. కింగ్స్‌ పంజాబ్‌ జట్టులోకి క్రిస్‌ గేల్‌ రాగా, స్టోనిస్‌కు విశ్రాంతి కల్పించారు. మరొకవైపు అక్షర్‌ పటేల్‌ స్థానంలో బరిందర్‌ శ్రాన్‌ తుది జట్టులోకి వచ్చాడు.  ఇక చెన్నై జట్టులోకి సురేశ్‌ రైనా స్థానంలో మురళీ విజయ్‌ వచ్చాడు.

చెన్నై సూపర్‌ కింగ్స్‌ తుది జట్టు

ఎంఎస్‌ ధోని(కెప్టెన్‌), డ్వాన్‌ బ్రావో, షేన్‌ వాట్సన్‌, బిల్లింగ్స్‌, రవీంద్ర జడేజా, రాయుడు, హర్భజన్‌ సింగ్‌, దీపక్‌ చాహర్‌, ఇమ్రాన్‌ తాహీర్‌, శార్థూల్‌ ఠాకూర్‌, మురళీ విజయ్‌

కింగ్స్‌ పంజాబ్‌ తుది జట్టు

రవిచంద్రన్‌ అశ్విన్‌(కెప్టెన్‌), మయాంక్‌ అగర్వాల్‌, లోకేశ్‌ రాహుల్‌, కరణ్‌ నాయర్‌, యువరాజ్‌ సింగ్‌, ఆండ్రూ టై, మోహిత్‌ శర్మ, ముజీబ్‌ ఉర్‌ రహ్మాన్‌, ఆరోన్‌ ఫించ్‌, క్రిస్‌ గేల్‌, బరిందర్ శ్రాన్

మరిన్ని వార్తలు