స్వీట్ మెమొరీస్‌.. హీరోయిన్‌ను గుర్తుపట్టగలరా?

15 Apr, 2018 20:02 IST|Sakshi
జాక్వెలీన్‌ ఫెర్నాండెజ్ చిన్ననాటి ఫోటో

సోషల్‌ మీడియాలో సినీ తారలకు సంబంధించిన ఏ చిన్న విషయమైనా  వైరల్‌గా మారటం పరిపాటయ్యింది. ప్రస్తుతం ఓ నటికి సంబంధించిన చిన్నప్పటి ఫోటో 17గంటల్లో 12 లక్షల వ్యూస్‌ సాధించి ఔరా అనిపించింది. ప్రముఖ బాలీవుడ్‌ నటి జాక్వెలీన్‌ ఫెర్నాండెజ్ సింహళ నూతన సంవత్సరాది సందర్భంగా తన చిన్ననాటి ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు.

‘ అందరికి సింహళ నూతన సంవత్సరాది శుభాకాంక్షలు. ఇది నేను వేసుకున్న మొదటి ఆఫ్‌శారీ’ అని ఆమె ట్వీట్‌ చేశారు. దీంతో కొంత మంది అభిమానులు ఆమె అందాన్ని అభినందిస్తూ పొగడ్తలతో ముంచెత్తారు. ఆ చీరలో నువ్వు‍ చాలా అందంగా ఉన్నావని కొందరు.. అప్పటికి ఇప్పటికి నువ్వు ఏమీ మారలేదని మరికొందరు జాక్వెలీన్‌ను పొగిడారు.

ఎప్పుడూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే జాక్వెలీన్‌ తనకు సంబంధించిన చిన్న చిన్న విషయాలను అభిమానులతో పంచుకుంటుంటారు. ఆమె ప్రస్తుతం సల్మాన్‌ ఖాన్‌కు జంటగా  రేస్‌-3 సినిమాలో నటిస్తున్నారు. 

අලුත් අවුරුද්ද Happy Sinhalese New Year everyone!!! My first Kandyan saree ❤️❤️

A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా