సిగ్గుచేటు

25 Jul, 2014 01:39 IST|Sakshi

డోపీగా తేలిన భారత పారా అథ్లెట్ సచిన్
 గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. పతకాల ఖాతా తెరవకముందే దేశానికి అప్రతిష్ట తెచ్చిపెట్టాడు పారా పవర్‌లిఫ్టర్ సచిన్ చౌదరి. డోప్ టెస్టులో పట్టుబడి ఇంటిబాట పట్టాడు. అయితే ఈ టెస్టు జరిపింది ఇప్పుడు కాదు. కామన్వెల్త్ పోటీలకు బయలుదేరకముందే జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) గత నెలలో జరిపిన ‘అవుట్ ఆఫ్ కాంపిటీషన్’ టెస్టులో సచిన్ నిషేధిత ఉత్ప్రేరకం వాడినట్లు ఆలస్యంగా వెల్లడైంది.
 
 దీంతో అతని పేరును పోటీల జాబితా నుంచి తొలగించినట్లు పారా స్పోర్ట్స్ సభ్యుడొకరు తెలిపారు. అతను మళ్లీ గ్లాస్గోకు వచ్చే అవకాశం లేదన్నారు. అనుభవజ్ఞుడైన సచిన్ చౌదరి నిష్ర్కమణతో పారా పవర్‌లిఫ్టింగ్‌లో భారత్ పతకం సాధించే అవకాశం కోల్పోయినట్లయింది. అయితే ఈ విషయమై తమకు ఇంతవరకు ఎటువంటి సమాచారం రాలేదని భారత పారాలింపిక్స్ కమిటీ అధ్యక్షుడు రాజేష్ తోమర్ తెలిపారు.
 

మరిన్ని వార్తలు