సీఎస్‌కే నాలుగో అత్యల్పం

23 Mar, 2019 22:59 IST|Sakshi

సాక్షి, చెన్నై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) సీజన్‌ 12 తొలి మ్యాచ్‌ చాలా చప్పగా సాగుతోంది. తొలుత రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సీబీ) 70 పరుగులకే కుప్పకూలింది. చెన్నై సూపర్‌ కింగ్స్‌ బౌలర్లు హర్భజన్‌(3/20) , తాహీర్‌(3/9), జడేజా(2/15)లు విజృంభించడంతో ఆర్సీబీ బ్యాట్స్‌మెన్‌ చేతులెత్తేశారు. అనంతరం 71 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్‌కే కూడా నెమ్మదిగా ఇన్నింగ్స్‌ కొనసాగించింది. ఆర్సీబీ కూడా కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో పరుగులు రాబట్టడానికి బ్యాట్స్‌మెన్‌ ఇబ్బందులు పడ్డారు. దీంతో పవర్‌ ప్లేలో 16 పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతో పవర్‌ప్లేలో నాలుగో అత్యల్ప స్కోర్‌ నమోదు చేసిన జట్టుగా సీఎస్‌కే నిలిచింది. ఈ జాబితాలో రాజస్తాన్‌(14, 2009లో), సీఎస్‌కే(15, 2011లో), సీఎస్‌కే(16, 2015లో) తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. తొలి నాలుగు స్థానాల్లో సీఎస్‌కే జట్టువే మూడు ఉండటం గమనార్హం. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు