ధోని ఎన్నాళ్లకెన్నాళ్లకు..!

22 Jun, 2019 20:41 IST|Sakshi

సౌతాంప్టన్‌:  వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌లో భారత మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని స్టంపౌట్‌ అయ్యాడు. భారత ఇన్నింగ్స్‌లో భాగంగా రషీద్‌ ఖాన్‌ వేసిన 45 ఓవర్‌ మూడో బంతిని ముందుకొచ్చి ఆడబోయిన ధోని స్టంప్‌ ఔట్‌గా నిష్క్రమించాడు. కాగా, వన్డే ఫార్మాట్‌లో ధోని స్టంప్‌ ఔట్‌ కావడం రెండోసారి మాత్రమే. అంతకుముందు 2011లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని స్టంప్‌ ఔట్‌ కాగా, తాజాగా మరోసారి అదే తరహాలో పెవిలియన్‌ చేరాడు. (ఇక్కడ చదవండి: టీమిండియా తడ‘బ్యాటు’)

దాంతో ఎనిమిదేళ్ల తర్వాత ధోని స్టంప్‌ ఔట్‌గా పెవిలియన్‌ చేరడం అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. అయితే అది కూడా వరల్డ్‌కప్‌లోనే కావడం ఇక్కడ విశేషం. ఈ మ్యాచ్‌లో భారత్‌ ముందుగా బ్యాటింగ్‌ చేసి 8 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది.  విరాట్‌ కోహ్లి(67), కేదార్‌ జాదవ్‌(52)లు హాఫ్‌ సెంచరీలు సాధించగా, కేఎల్‌ రాహుల్‌(30), విజయ్‌ శంకర్‌(29), ఎంఎస్‌ ధోని(28)లు కాస్త ఫర్వాలేదనిపించారు.


 

మరిన్ని వార్తలు