30 ఓవర్లలో ఇంగ్లండ్ 153/6

14 Feb, 2015 15:38 IST|Sakshi

మెల్ బోర్న్:  ఆస్ట్రేలియాతో మ్యాచ్లో ఇంగ్లండ్ ఓటమి దిశగా పయనిస్తోంది. 343 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 30 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది.  ప్రస్తుతం టేలర్ (43), వోక్స్ (29) క్రీజులో ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ మార్ష్ (5/19) అద్భుతమైన బౌలింగ్తో చెలరేగడంతో..

ప్రపంచకప్ పూల్-ఎలో భాగంగా శనివారం జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 342 పరుగులు సాధించింది. ఆసీస్ ఓపెనర్ అరోన్ ఫించ్ (135) సూపర్ సెంచరీతో చెలరేగగా, ఇంగ్లండ్ బౌలర్  ఫిన్ హ్యాట్రిక్ వికెట్ సహా ఐదు వికెట్లు పడగొట్టాడు.

మరిన్ని వార్తలు