ఔరా.. ఏమి క్యాచ్‌ ఇది!

1 Jul, 2019 19:00 IST|Sakshi

చెస్టర్‌ లీ స్ట్రీట్‌ : వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌, లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ ఫాబియన్‌ అలెన్‌ స్టన్నింగ్‌ రిటర్న్‌ క్యాచ్‌తో ఔరా అనిపించాడు. ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంక స్టార్‌ బ్యాట్స్‌మన్‌ కుశాల్‌ మెండిస్‌ను మెస్మరైజ్‌ క్యాచ్‌తో ఔట్‌ చేసి అలెన్‌ ఆకట్టుకున్నాడు. సోమవారం రివర్‌సైడ్‌ గ్రౌండ్‌లో శ్రీలంక ఇన్నింగ్స్‌ సందర్బంగా ఈ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. ఫాబియన్‌ అలెన్‌ వేసిన 32వ ఓవర్‌ చివరి బంతిని కుశాల్‌.. బౌలర్‌కు కుడి భాగం నుంచి దూరంగా డ్రైవ్‌ ఆడాడు. అయితే బ్యాట్స్‌మన్‌ ఊహించిన దాని కంటే బంతి ఎక్కువగా గాల్లోకి లేచింది.

అయితే ఎవరూ ఊహించని విధంగా అలెన్‌ గాల్లోకి ఎగిరి రెండు చేతులా బంతిని అందుకున్నాడు. దీంతో ఒక్కసారిగా కుశాల్‌ షాక్‌కు గురై భారంగా క్రీజు వదిలి వెళ్లాడు. ఇక అలెన్‌ స్టన్నింగ్‌ క్యాచ్‌తో శ్రీలంకతో సహా కరేబియన్‌ ఆటగాళ్లు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇక ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ హల్‌చల్‌ చేస్తోంది. అలెన్‌ స్టన్నింగ్‌ క్యాచ్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇక ఇప్పటికే వెస్టిండీస్‌ ఆటగాళ్లు కళ్లు చెదిరే రీతిలో క్యాచ్‌లు అందుకున్నారు. ఆస్ట్రేలియా మ్యాచ్‌లో కరేబియన్‌ ఫాస్ట్‌ బౌలర్‌ కాట్రెల్‌ బ్రిలియంట్‌ క్యాచ్‌తో వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు