బోణీ కొట్టేనా..

15 Oct, 2019 07:43 IST|Sakshi

ఫిఫా ప్రపంచకప్‌ 2022 క్వాలిఫయర్స్‌

కోల్‌కతా: తమ చివరి మ్యాచ్‌లో ఆసియా చాంపియన్‌ ఖతర్‌ను నిలువరించిన భారత్‌ మరో మ్యాచ్‌కు సిద్ధమయింది. ప్రపంచకప్‌ క్వాలిఫ యర్స్‌లో భాగంగా నేడు ఇక్కడి సాల్ట్‌ లేక్‌ స్డేడి యంలో జరిగే మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. ఖతర్‌తో మ్యాచ్‌కు దూర మైన  స్టార్‌ సునీల్‌ ఛెత్రి తిరిగి జట్టులోకి రావ డం కలిసొచ్చే అంశం. బలాబలాల పరంగా చూస్తే భారత్‌ బంగ్లాదేశ్‌ కంటే ముందుంది. ప్రస్తుతం భారత్‌ 104వ ర్యాంకులో ఉండగా... బంగ్లాదేశ్‌ 207 ర్యాంకులో ఉంది. ఛెత్రి, బల్వంత్‌ సింగ్, మన్వీర్‌ సింగ్‌లతో కూడిన అటాకింగ్‌ చెలరేగితే భారత్‌కు విజయం ఖాయ మైనట్లే. వీరితో పాటు మిడ్‌ఫీల్డ్‌లో ఉదాంత సింగ్, ఆశికి కురునియన్‌ గోల్‌ చేసే అవకాశా లను సృష్టించడానికి సిద్ధంగా ఉన్నారు. 

అయితే భారత్‌ను డిఫెన్సు విభాగం కలవరపెడు తుంది. నేడు జరిగే మ్యాచ్‌కు డిఫెండర్‌ సందేశ్‌ జింగాన్‌ మోకాలి గాయంతో దూరం అయ్యా డు. ఒమన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో డిఫెన్సు లో అదరగొట్టిన భారత్‌ చివరి 9 నిమిషాల్లో చేతులెత్తేసి ప్రత్యర్థికి రెండు గోల్స్‌ను సమర్పిం చుకొని విజయాన్ని దూరం చేసుకుంది. భారత ఆటగాళ్లు అలసిపోవడమే దీనికి కారణం అని... వారి ఫిట్‌నెస్‌ను మెరుగుపరచాల్సిన అవసరం ఉందంటూ కోచ్‌ ఇగోర్‌ స్టిమాక్‌ తెలిపాడు. అయితే ఖతర్‌తో మ్యాచ్‌లో మాత్రం ఆకట్టు కుంది. ముఖ్యంగా ఛెత్రి గైర్హాజరీలో నాయకత్వ బాధ్యతలు చేపట్టిన గోల్‌కీపర్‌ గుర్‌ప్రీత్‌ సింగ్‌ సంధు ప్రత్యర్థి గోల్‌ చేసే అవకాశాలను సమ ర్థంగా అడ్డుకున్నాడు. 

వీరంతా సమిష్టిగా ఆడితే భారత్‌ ప్రపంచ కప్‌ ఆశలను సజీవంగా ఉంచు కున్నట్లే. ‘ ఇది ఛెత్రికి, బంగ్లాదేశ్‌కు మధ్య జరిగే మ్యాచ్‌ కాదు. భారత్‌కు బంగ్లాదేశ్‌కు మధ్య జరిగేది. నేను జట్టులో ఒక సభ్యుడిని మాత్ర మే. జట్టుకు విజయాన్ని అందించే ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు. మేమంతా ఒకటిగా... దేశం కోసం ఆడతాం.’ అని మ్యాచ్‌కు ముందు జరిగిన సమావేశంలో ఛెత్రి పేర్కొన్నాడు. భార త ఫుట్‌బాల్‌కు మక్కాగా భావించే కోల్‌కతాలో మ్యాచ్‌ జరుగుతుండటంతో... 45 వేల సామ ర్ధ్యం గల సాల్ట్‌లేక్‌ స్టేడియం టికెట్లు హాట్‌ కేకుల్లా అమ్ముడయ్యాయి. 

మరిన్ని వార్తలు