గంగూలీని కోహ్లి పొగడటంపై గావస్కర్‌ అసహనం

25 Nov, 2019 12:40 IST|Sakshi

కోల్‌కతా: ఇటీవల కాలంలో భారత క్రికెట్‌ జట్టు వరుసగా సాధిస్తున్న విజయాలకు మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ సారథ్యంలోనే బీజం పడిందని ప్రస్తుత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి వ్యాఖ్యానించడంపై దిగ్గజ ఆటగాడు సునీల్‌ గావస్కర్‌ అసహనం వ్యక్తం చేశాడు. సౌరవ్‌ గంగూలీ బీసీసీఐ అధ్యక్ష హోదాలో ఉన్నాడు కాబట్టే కోహ్లి పొగడాలనే ఉద్దేశంతోనే అలా చెప్పాడన్నాడు. ‘భారత జట్టు విజయాల బాట పట్టింది.. గంగూలీ సారథ్యంలోనే కాదు.. అప్పటికి నువ్వు ఇంకా పుట్టలేదు. 1970-80 దశకాల్లోనే భారత జట్టు అద్భుత విజయాలను సాధించింది. వాటి గురించి నీకు తెలీదు.(ఇక్కడ చదవండి: అది గంగూలీతోనే ప్రారంభమైంది: కోహ్లి)

గంగూలీ బీసీసీఐ బాస్‌ కాబట్టే కోహ్లి అలా మాట్లాడనే విషయం నాకు తెలుసు. అతని గురించి కొన్ని మంచి విషయాలు చెప్పాలనుకున్నాడు. దాని ఫలితమే మొత్తం క్రెడిట్‌ గంగూలీకే ఇచ్చేశాడు. గంగూలీ 2000 దశకంలో భారత జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. అసలు క్రికెట్‌ అనేది అప్పుడే పుట్టిందా అని చాలామంది అనుకుంటారు. భారత జట్టు 70-80 దశకం మధ్యలో అసాధారణ విజయాలు సాధించిందనే విషయం చెప్పదలుచుకున్నా. 1986లోనే భారత జట్టు విదేశాల్లో విజయం సాధించింది. చాలా విదేశీ టెస్టులను భారత్‌ డ్రా చేసుకుంది కూడా. మిగత జట్లు ఎలా విదేశాల్లో పరాజయం పాలవుతారో అదే తరహాలో మాకు అపజయాలు ఉన్నాయి’ అని గావస్కర్‌ పేర్కొన్నాడు. ఇక బంగ్లాదేశ్‌పై భారత్‌ సాధించిన విజయం అద్వితీయమని అని ఈ మాజీ కెప్టెన్‌ తెలిపాడు.

మరిన్ని వార్తలు