క్వార్టర్‌ ఫైనల్లో గాయత్రి

25 May, 2019 09:54 IST|Sakshi

ఆలిండియా బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌  

సాక్షి, హైదరాబాద్‌: ఆలిండియా జూనియర్‌ ర్యాంకింగ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ ప్లేయర్లు పుల్లెల గాయత్రి, సామియా ఇమాద్‌ ఫరూఖీ క్వార్టర్‌ ఫైనల్‌కు దూసుకెళ్లారు. చెన్నైలో శుక్రవారం జరిగిన బాలికల సింగిల్స్‌ మూడోరౌండ్‌లో టాప్‌సీడ్‌ గాయత్రి 22–20, 21–16తో క్వాలిఫయర్‌ ఖుషీ గుప్తా (ఢిల్లీ)పై గెలుపొందింది. మరో మ్యాచ్‌లో ఐదో సీడ్‌ సామియా ఇమాద్‌ ఫరూఖీ (తెలంగాణ) 21–11, 21–18తో కేయూర మోపాటి (తెలంగాణ)ని ఓడించింది. బాలు ర సింగిల్స్‌ విభాగంలో డి. శరత్‌ (ఆంధ్రప్రదేశ్‌) క్వార్టర్స్‌కు చేరుకోగా.... తరుణ్‌ (తెలంగాణ), ప్రణవ్‌ రావు (తెలంగాణ), సాయిచరణ్‌ (ఆంధ్రప్రదేశ్‌) మూడోరౌండ్‌లో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించారు. తొమ్మిదో సీడ్‌ శరత్‌ 21–11, 21–13తో ఎం. తరుణ్‌పై గెలుపొందగా... మూడో సీడ్‌ సాయిచరణ్‌ కోయ 22–24, 17–21తో పదో సీడ్‌ సిద్ధాంత్‌ గుప్తా (తమిళనాడు) చేతిలో, ప్రణవ్‌ రావు 17–21, 15–21తో ఐదో సీడ్‌ ఆకాశ్‌ యాదవ్‌ (ఢిల్లీ) చేతిలో పరాజయం పాలయ్యారు.

మిక్స్‌డ్‌ డబుల్స్‌ రెండో రౌండ్‌లో టాప్‌ సీడ్‌ నవనీత్‌–సాహితి (తెలంగాణ) ద్వయం 21–9, 24–26, 21–16తో మంజిత్‌ సింగ్‌ (మణిపూర్‌)–మెహ్రీన్‌ రిజా (కేరళ) జంటపై గెలు పొంది క్వార్టర్స్‌కు చేరుకుంది. బాలికల డబుల్స్‌ తొలిరౌండ్‌లో ఏడో సీడ్‌ శ్రీవిద్య గురజాడ–సాయి శ్రీయ జంట 21–12, 21–9తో రుద్రాణి (ఉత్తరప్రదేశ్‌)–ఆత్మజయిత రాయ్‌ బర్మన్‌ (త్రిపుర) జోడీపై, సాహితి (తెలంగాణ)–ద్రితి (కర్ణాటక) జంట 21–8, 21–23, 21–14తో దుర్వా గుప్తా (ఢిల్లీ)–భార్గవి (తెలంగాణ) జోడీపై, హాసిని–జాహ్నవి (ఆంధ్రప్రదేశ్‌) జంట 22–24, 21–18, 21–16తో సాక్షి–యషిక (హరియాణా) జోడీపై గెలుపొంది రెండో రౌండ్‌లో అడుగుపెట్టాయి. బాలుర డబుల్స్‌ తొలిరౌండ్‌లో అచ్యుతాదిత్య రావు (తెలంగాణ)–వెంకట హర్ష (ఆంధ్రప్రదేశ్‌) జంట 21–14, 21–17తో నమన్‌–అర్జున్‌ (ఢిల్లీ) జోడీపై, తరుణ్‌–ఖదీర్‌ (తెలంగాణ) జంట 21–14, 12–21, 21–13తో అవినాశ్‌–ఆయుశ్‌ (ఒడిశా) జోడీపై, నవనీత్‌ (తెలంగాణ)–ఎడ్విన్‌ జాయ్‌ (కేరళ) జంట 21–15,21–15తో సనీత్‌–పృథ్వీ (కర్ణాటక) జోడీపై గెలుపొందాయి.  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పాక్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుష్‌!

అంతా ఐపీఎలే చేసింది : డూప్లెసిస్‌

వైరల్‌: భారత్‌-పాక్‌ మ్యాచ్‌లో గెలిచిన ‘ప్రేమ’

గాయత్రి డబుల్‌ ధమాకా

బ్రాత్‌వైట్‌ సెంచరీతో పోరాడినా...

చాంపియన్‌ భారత్‌

ఇది క్లిష్టమైన విజయం

పాకిస్తాన్‌ గెలిచింది...

మూడో పాక్‌ క్రికెటర్‌గా..

సర్ఫరాజ్‌ భయపడ్డాడా?

చెలరేగిన సొహైల్‌.. దక్షిణాఫ్రికా లక్ష్యం 309

ఇమ్రాన్‌ తాహీర్‌ ‘వరల్డ్‌కప్‌’ రికార్డు

ఒకే స్కోరు.. ఒకే బౌలర్‌

కోహ్లి, బుమ్రాలకు విశ్రాంతి!

వెల్‌డన్‌ బ్రాత్‌వైట్‌.. బాగా ఆడావ్‌!

అందుకు కారణం అతనే: షమీ

విరాట్‌ కోహ్లికి జరిమానా

పాకిస్తాన్‌ గెలిస్తేనే..!

సింగిల్స్‌ విజేత లక్ష్మీసాహితిరెడ్డి

టైటిల్‌పోరుకు రాహుల్‌, గాయత్రి

కోహ్లి నీ కెప్టెన్సీ సూపరో సూపర్‌!

మాజీ ఆటగాళ్లపై సర్ఫరాజ్‌ ఫైర్‌!

కోహ్లి ఫొటోపై జోకులే జోకులు!

షమీ హ్యాట్రిక్‌ క్రెడిట్‌ ధోనిదే!

మావాళ్లు ఆకలిమీదున్నారు : కోహ్లి

ఒలింపిక్స్‌ క్వాలిఫయర్స్‌ బెర్త్‌ సొంతం

ఉత్కంఠ పోరులో కివీస్‌దే విజయం

భారత్‌ అజేయభేరి

విలియమ్సన్‌ మరో శతకం.. విండీస్‌ లక్ష్యం 292

ధోని ఎన్నాళ్లకెన్నాళ్లకు..!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

జెట్‌ స్పీడ్‌లో దూసుకుపోతున్న నితిన్‌

మొదలైన ‘ప్రతిరోజు పండగే’

వేట మొదలైంది

ఏజెంట్‌ నూర్‌

సరిగమల సమావేశం

రాగల 24 గంటల్లో...