ప్లీజ్.. నన్ను చంపొద్దు: క్రికెటర్ విజ్ఞప్తి

29 Nov, 2017 20:15 IST|Sakshi

న్యూఢిల్లీ: అసలే ఫామ్ కోల్పోయాడు. ఆపై గాయం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీలో ఫిట్‌నెస్ కోసం తంటాలు పడుతున్న పాకిస్తాన్ క్రికెటర్ ఉమర్ అక్మల్ చనిపోయాడంటూ సోషల్ మీడియాలో పోస్టులు చక్కర్లు కొట్టాయి. 'నేను బతికే ఉన్నాను. లాహోర్‌లో క్షేమంగా ఉన్నాను. జాతీయ జట్టులోకి వచ్చేందుకు ఫిట్‌నెస్ పై దృష్టిపెట్టాను. దయచేసి నన్ను చంపోద్దంటూ' అక్మల్ ట్వీట్ చేశాడు. అయినా తాను చనిపోయానంటూ ప్రచారం జరగడంపై మరోసారి వీడియో రూపంలో స్పందించాడు. తాను నిక్షేపంగా ఉన్నానని, ఎలాంటి ఆందోళన అక్కర్లేదని వీడియో పోస్ట్ చేశాడు ఈ క్రికెటర్.

'అందరికీ నమస్కారం. అల్లా దయ వల్ల నేను ప్రాణాలతోనే ఉన్నాను. నాపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. నేను బతికే ఉన్నాను. నేషనల్ 20కప్ 2017 సెమీ ఫైనల్ మ్యాచ్‌లో నన్ను చూస్తారు. నేను చనిపోయానంటూ ఎలాంటి వార్తలు వ్యాప్తి చేయొద్దు. అందరికీ ధన్యవాదాలు' అంటూ ఉమర్ అక్మల్ తాను పోస్ట్ చేసిన వీడియో ద్వారా విజ్ఞప్తి చేశాడు.

ఇటీవల పాకిస్తాన్‌లో మతఘర్షణలు చేలరేగడంతో కొందరు ప్రాణాలు కోల్పోయారు. కాగా, సోషల్ మీడియాలో ఓ నెటిజన్.. ఉమర్ ఫొటో పోస్ట్ చేస్తూ.. క్రికెటర్ చనిపోయాడని పోస్ట్ చేయడం కలకలం రేపింది. దీంతో తాను బతికే ఉన్నానంటూ ఉమర్ అక్మల్ సోషల్ మీడియాలో రెండు రోజులు పోస్టులు చేశాడు.

మరిన్ని వార్తలు