ఆటగాళ్ల గౌరవం పెంచుతాను: రాజ్యవర్ధన్‌ రాథోడ్‌

5 Sep, 2017 00:45 IST|Sakshi
ఆటగాళ్ల గౌరవం పెంచుతాను: రాజ్యవర్ధన్‌ రాథోడ్‌

క్రీడాకారులకు కావాల్సిన సౌకర్యాలు అందించడంతో పాటు వారికి తగిన గౌరవం కూడా దక్కేలా చేయడమే తమ ప్రథమ కర్తవ్యమని కేంద్ర క్రీడల కొత్త మంత్రి రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాథోడ్‌ అన్నారు. దేశానికి ప్రాతినిధ్యం వహించేవారి కోసం ‘సమ్మాన్‌ అవుర్‌ సువిధా’ అనే మంత్రంతో తాము పని చేస్తామని ఆయన చెప్పారు.

ఒకప్పుడు తాను ఇదే క్రీడా శాఖ కార్యాలయంలో అధికారులను కలిసేందుకు అనుమతుల కోసం అష్టకష్టాలు పడాల్సి వచ్చిందని... భవిష్యత్తులో ఆటగాళ్లకు అలాంటి సమస్య ఎప్పటికీ రాకుండా అన్ని చర్యలు తీసుకుంటామని కూడా రాథోడ్‌ స్పష్టం చేశారు.  

మరిన్ని వార్తలు