‘నేనైతే ధావన్‌ను ఎంపిక చేయను’

6 Jan, 2020 13:47 IST|Sakshi

వరల్డ్‌కప్‌కు అతను వద్దే వద్దు..!

న్యూఢిల్లీ: దాదాపు రెండు నెలలుగా గాయం కారణంగా భారత క్రికెట్‌ జట్టుకు దూరమైన శిఖర్‌ ధావన్‌ రీఎంట్రీని ఘనంగా చాటాలని భావిస్తున్నాడు. పూర్తి ఫిట్‌నెస్‌తో శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌కు సిద్ధమయ్యాడు. అయితే తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా, మిగతా రెండులు జరిగితే ధావన్‌ పూర్వపు ఫామ్‌ను అందుకున్నాడో లేదో తెలుస్తుంది. ఇటీవలే తన క్లాస్‌ శాశ్వతం అంటూ ప్రకటించిన ధావన్‌.. ఆడటం-ఆపేయడం చేస్తూ ఉన్నప్పటికీ తానేమీ ఆటను మరిచిపోలేదన్నాడు. తప్పకుండా పరుగులు సాధించి సత్తాచాటతానని ధీమా వ్యక్తం చేశాడు.(ఇక్కడ చదవండి: రాహుల్‌ భర్తీ చేశాడు.. కానీ నా క్లాస్‌ శాశ్వతం!)

అయితే అసలు భారత క్రికెట్‌ జట్టులో ధావన్‌ అనవరసం అనే విధంగా మాజీ క్రికెటర్‌ కృష్ణమాచారి శ్రీకాంత్‌ మాట్లాడాడు. తానే గనుక చీఫ్‌ సెలక్టర్‌గా ఉంటే ధావన్‌ను ఎంపిక చేయనన్నాడు. వచ్చే టీ20 వరల్డ్‌కప్‌ నేపథ్యంలో శ్రీకాంత్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు. టీ20 వరల్డ్‌కప్‌కు ధావన్‌ ఓపెనర్‌గా అనవసరమన్నాడు. ‘ శ్రీలంకతో టీ20 సిరీస్‌లో పరుగుల్ని కౌంట్‌ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎవరు సత్తాచాటిన అది వరల్డ్‌కప్‌ వంటి మెగాటోర్నీకి ప్రామాణికంగా తీసుకోకూడదు. నా దృష్టిలో రాబోయే వరల్డ్‌ టీ20కి ధావన్‌ అనవసరం. అతను వద్దే వద్దు. నేనే చీఫ్‌ సెలక్టర్‌ స్థానంలో ఉండి ఉంటే ధావన్‌ను ఎంపిక చేయను. ఓపెనర్‌గా ధావన్‌ కంటే కేఎల్‌ రాహులే అత్యుత్తమం. ఇక్కడ రాహుల్‌కు ధావన్‌కు పోటీనే లేదు. వీరిద్దరిలో రాహులే విన్నర్‌. విజేత ఒక్కడే ఉంటాడు’ అని శ్రీకాంత్‌ పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు