సెమీస్‌లో ఓడిన బోపన్న జోడీ 

19 Nov, 2023 04:06 IST|Sakshi

టురిన్‌ (ఇటలీ): పురుషుల టెన్నిస్‌ సీజన్‌ ముగింపు టోర్నీ ఏటీపీ ఫైనల్స్‌ డబుల్స్‌ విభాగంలో రోహన్‌ బోపన్న (భారత్‌)–మాథ్యూ ఎబ్డెన్‌ (ఆ్రస్టే లియా) జోడీ పోరాటం ముగిసింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో బోపన్న–ఎబ్డెన్‌ ద్వయం 5–7, 4–6తో గ్రానోలెర్స్‌ (స్పెయిన్‌)–జెబలాస్‌ (అర్జెంటీనా) జోడీ చేతిలో ఓడిపోయింది.

79 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న జంట 11 ఏస్‌లు సంధించి, ఐదు డబుల్‌ ఫాల్ట్‌లు చేసి, తమ సర్విస్‌ను రెండుసార్లు కోల్పోయింది. సెమీస్‌లో ఓడిన బోపన్న–ఎబ్డెన్‌ జోడీకి 3,22,000 డాలర్ల (రూ. 2 కోట్ల 68 లక్షలు) ప్రైజ్‌మనీ లభించింది. ఓవరాల్‌గా ఈ సీజన్‌లో బోపన్న–ఎబ్డెన్‌ జోడీ 21 టోర్నీలు ఆడింది. . ఏడు టోర్నీల్లో ఫైనల్‌కు చేరి రెండు టోర్నీల్లో టైటిల్‌ సాధించి, ఐదు టోర్నీల్లో రన్నరప్‌గా నిలిచింది. 

మరిన్ని వార్తలు