ఐసీసీ టీ20 కెప్టెన్‌గా హర్మన్‌ ప్రీత్‌

31 Dec, 2018 15:50 IST|Sakshi

దుబాయ్‌: భారత మహిళా క్రికెటర్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) టీ20 కెప్టెన్‌గా ఎంపికయ్యారు. ఈ ఏడాదికిగాను అత్యుత్తమ మహిళా క్రికెట్‌ జట్లను ఐసీసీ ఎంపిక చేయగా, అందులో టీ 20 విభాగంలో హర్మన్‌ ప్రీత్‌ కెప్టెన్‌గా నియమించబడ్డారు. ఈ మేరకు సోమవారం అత్యుత్తమ మహిళా వన్డే, టీ20 జట్లను ఐసీసీ ప్రకటించింది. టీ 20 ఫార్మాట్‌లో భారత్‌ నుంచి హర్మన్‌తో పాటు స్మృతీ మంధాన, పూనమ్‌ యాదవ్‌లకు చోటు దక్కింది. ఇక వన్డే విభాగంలో భారత్‌ నుంచి స్మృతీ మంధాన, పూనమ్‌ యాదవ్‌లకు మాత్రమే స్థానం దక్కగా,  కెప్టెన్‌గా న్యూజిలాండ్‌ మహిళా క్రికెటర్‌ సుజీ బేట్స్‌ నియమించబడ్డారు. 2018గాను క్రీడాకారిణుల ప్రదర్శనలో భాగంగా మీడియా-బ్రాడ్‌కాస్టర్స్‌ సభ్యులతో కూడిన బృందం విడివిడిగా రెండు అత్యుత్తమ జట్లను ఓటింగ్‌ ద్వారా ఎన్నుకుంది.

నవంబర్‌లో జరిగిన ఐసీసీ మహిళల వరల్డ్‌ టీ20లో భారత జట్టు సెమీ ఫైనల్స్‌కు చేరడంలో హర్మన్‌ ప్రీత్‌ కీలక పాత్ర పోషించారు. ఆ టోర్నమెంట్‌లో కౌర్‌ 160.5 స్ట్రైక్‌రేట్‌తో 183 పరుగులు చేశారు. 2018లో హర్మన్‌ ప్రీత్‌ 25 టీ20 మ్యాచ్‌లుఆడి 126.1 స్ట్రైక్‌రేట్‌తో 663 పరుగులు సాధించారు. మరొకవైపు ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో కౌర్‌ మూడో స్థానంలో కొనసాగుతున్నారు.

ఐసీసీ మహిళా టీ20 జట్టు: హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌(కెప్టెన్‌, భారత్‌), స్మృతీ మంధాన(భారత్‌), అలైస్సా హేలీ(ఆస్ట్రేలియా, వికెట్‌ కీపర్‌), సుజీ బేట్స్‌( న్యూజిలాండ్‌), నాటేటీ స్కీవర్‌(ఇంగ్లండ్‌), ఎలైసె పెర్రీ(ఆస్ట్రేలియా), అష్లే గార్డనర్‌(ఆస్ట్రేలియా), కాస్పెర్క్‌(న‍్యూజిలాండ్‌), మెగాన్‌ స్కట్‌(ఆస్ట్రేలియా), రుమానా అహ్మద్‌(బంగ్లాదేశ్‌), పూనమ్‌ యాదవ్‌(భారత్‌)

ఐసీసీ వన్డే జట్టు: సుజీ బేట్స్‌(కెప్టెన్‌, న్యూజిలాండ్‌), స్మృతీ మంధాన, టామీ బీమౌంట్‌(ఇంగ్లండ్‌), డేన్‌వాన్‌ నీకెర్క్‌(దక్షిణాఫ్రికా), సోఫీ డివైన్‌(న్యూజిలాండ్‌), అలైస్సా హేలీ(వికెట్‌ కీపర్‌, ఆస్ట్రేలియా), మారింజన్నే కాప్‌(దక్షిణాఫ్రికా), డాటిన్‌( వెస్టిండీస్‌), సానా మిర్‌(పాకిస్తాన్‌),  సోఫీ ఎక్లేస్టోన్‌(ఇంగ్లండ్‌), పూనమ్‌ యాదవ్‌(భారత్‌)

మరిన్ని వార్తలు