టీమిండియాదే తొలుత బ్యాటింగ్‌

27 Feb, 2020 09:18 IST|Sakshi

మెల్‌బోర్న్‌: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా నేడు న్యూజిలాండ్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన కివీస్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. జ్వరం కారణంగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు దూరమైన స్టార్‌ ఓపెనర్‌ సృతి మంధాన తిరిగి జట్టులోకి చేరారు. అదేవిధంగా రాధా యాదవ్‌ను కూడా తుదిజట్టులోకి తీసుకున్నారు. వీరిద్దరి జట్టులో చేరడంతో అరుంధతి, రిచాలపై వేటు పడింది. టాస్‌లో భాగంగా హర్మన్‌ మాట్లాడుతూ.. టాస్‌ గెలిచినా తాము తొలుత బ్యాటింగ్‌ తీసుకుందామనుకున్నామని తెలిపారు. గత రెండు మ్యాచ్‌ల్లో తాను అంతగా రాణించలేదని, కివీస్‌పై మంచి ప్రదర్శన చేయాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా మంచి ప్రదర్శన ఇవ్వడానికి తమ ప్లేయర్స్‌ సిద్దంగా ఉన్నట్లు హర్మన్‌ వివరించారు.

ఇక ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌లపై అద్భుత విజయాలు సాధించిన టీమిండియా హ్యాట్రిక్‌పై కన్నెసింది. కివీస్‌తో జరిగే ఈ మ్యాచ్‌లో గెలిచి గ్రూప్‌ ఏలో టాప్‌ ప్లేస్‌తో పాటు సెమీస్‌కు మార్గం సుగుమం చేసుకోవాలని హర్మన్‌ సేన ఆరాటపడుతోంది. ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి 16 ఏళ్ల టీనేజ్‌ సంచలనం షఫాలీ వర్మ, నిలకడైన ఆటతీరుతో రాణిస్తున్న రోడ్రిగ్స్‌లపైనే ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. వీరిద్దరికి స్మృతి మంధాన, హర్మన్‌లు జతకలిస్తే కివీస్‌కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించవచ్చు. ఇక బౌలింగ్‌లో పూనమ్‌ యాదవ్‌ బెబ్బులిలా రెచ్చిపోతున్న విషయం తెలిసిందే. తన స్పిన్‌ బౌలింగ్‌తో ప్రత్యిర్థి బ్యాటర్ల్‌ను ముప్పుతిప్పలు పెడుతుండగా.. శిఖా పాండే తన అనుభవంతో కీలక సమయంలో వికెట్లు సాధిస్తున్నారు.  

తుది జట్లు: 
టీమిండియా: హర్మన్‌ప్రీత్‌ కౌర్‌(కెప్టెన్‌), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, తానియా భాటియా, జెమీమా రోడ్రిగ్స్‌, వేదా కృష్ణమూర్తి, దీప్తి శర్మ, శిఖా పాండే, రాధా యాదవ్‌, పూనమ్‌ యాదవ్‌, రాజేశ్వరి గైక్వాడ్‌
న్యూజిలాండ్‌: సోఫీ డివైన్‌(కెప్టెన్‌), రేచల్‌ ప్రీస్ట్‌, సుజీ బేట్స్‌, మాడీ గ్రీన్‌, కాటీ మార్టన్‌, అమెలియా కెర్‌, హయ్‌లీ జెన్‌సెన్‌, అన్నా పీటర్‌సన్‌, లీ కాస్పెరెక్‌, లియా తహుహు, రోజ్‌మెరీ మెయిర్‌ 

చదవండి:
‘డ్యాన్స్‌ బాగుంది.. ట్రోఫీ తెస్తే ఇంకా బాగుంటుంది’
‘ఆ విషయంలో ఆమెకు ఫుల్‌ లైసెన్స్‌’

మరిన్ని వార్తలు