విరాట్‌ కోహ్లి గోల్డెన్‌ డక్‌

18 Dec, 2019 16:27 IST|Sakshi

విశాఖ: వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో నాలుగు పరుగులే చేసి నిరాశపరిచిన టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి.. రెండో వన్డేలో సైతం విఫలమయ్యాడు. విశాఖలో జరుగుతున్న రెండో వన్డేలో కోహ్లి ఆడిన తొలి బంతికే డకౌటై గోల్డెన్‌ డక్‌గా నిష్క్రమించాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా  బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 227 పరుగుల తొలి వికెట్‌ భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. రోహిత్‌-రాహుల్‌లు సెంచరీలతో మెరవడంతో భారత్‌ రెండొందలకు పైగా మొదటి వికెట్‌ భాగస్వామ్యాన్ని సాధించింది.(ఇక్కడ చదవండి:రోహిత్‌ ‘టాప్‌’ లేపాడు..)

అయితే రాహుల్‌(102) తొలి వికెట్‌గా ఔటైన తర్వాత ఫస్ట్‌ డౌన్‌లో క్రీజ్‌లోకి వచ్చిన కోహ్లి అనవసరపు షాట్‌కు యత్నించి పెవిలియన్‌ చేరాడు. పొలార్డ్‌ వేసిన 38వ ఓవర్‌ మూడో బంతిని స్లో షార్ట్‌ బాల్‌గా సంధించగా కోహ్లి పుల్‌ చేయబోయాడు. అది కాస్తా మిడ్‌ వికెట్‌లో లేవడంతో అక్కడే ఫీల్డింగ్‌ చేస్తున్న రోస్టన్‌ ఛేజ్‌ పట్టుకున్నాడు. దాంతో  కోహ్లి ఇన్నింగ్స్‌ ఖాతా తెరవకుండానే ముగిసింది. కోహ్లి ఔట్‌ కావడంతో ఒక్కసారిగా స్టేడియంలో నిశ్శబ్ధ వాతావారణం నెలకొంది. 39 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ రెండు వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది.

మరిన్ని వార్తలు