ధోని ఈ సిక్సు.. ఆ రోజును గుర్తు చేసింది..!

21 Oct, 2017 09:02 IST|Sakshi

సాక్షి, ముంబై: మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని బాదిన ఓ షాట్‌ 2011 ప్రపంచకప్‌ ఫైనల్‌ ఫినిషింగ్‌ షాట్‌ను గుర్తు చేసిందని బీసీసీఐ ట్వీట్‌ చేసింది. సిక్సర్లతో మ్యాచ్‌ను ముగించే సత్తా మహేంద్రుడికి వెన్నతో పెట్టిన విద్యలాంటిది. వాంఖడే స్టేడియంలో శ్రీలంకతో జరిగిన ప్రపంచకప్‌ ఫైనల్‌లో ధోని సిక్సుతో భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించిన విషయం తెలిసిందే. అయితే న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌కు ఇదే వాంఖడే స్టేడియం ఆతిథ్యం ఇస్తోంది. ఆదివారం జరిగే ఈ వన్డేకు కోహ్లి సేన కసరత్తులను ముమ్మరం చేస్తోంది. ప్రాక్టీస్‌ సెషన్‌లో ధోని కొట్టిన ఓ షాట్‌ వీడియోను ‘  ధోని వాంఖడేలో నీవు కొట్టిన బిగ్‌ షాట్‌..  మధుర క్షణమైన 2011 సిక్సును గుర్తుచేస్తోంది’.  అనే క్యాఫ్షన్‌తో బీసీసీఐ ట్విట్టర్‌ వేదికగా అభిమానులతో పంచుకుంది. ఇప్పుడు ఈ వీడియో అభిమానులను తెగ ఆకట్టకుంటోంది.

ఎంత ఒత్తిడి సమయంలోనైనా ఎలాంటి భయంలేకుండా మ్యాచ్‌లను ముగించే ధోని ఈ మధ్య కాలంలో కొత్త అవతారం ఎత్తాడు. క్లిష్ట పరిస్థితుల్లో ఆచితూచి ఆడుతూ సహచరులతో మ్యాచ్‌లను గెలిపిస్తున్నాడు. న్యూజిలాండ్‌ సిరీస్‌లోనైనా తన సిక్సులతో మరోసారి అలరిస్తాడని, బీసీసీఐ, అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

ధోని వాంఖడేలో  అప్పుడు ఇప్పుడు  

మరిన్ని వార్తలు