భారత్‌లో బధిరుల టి20 ప్రపంచకప్‌ 

28 Sep, 2018 02:08 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ ఆతిథ్యమివ్వనున్న బధిరుల టి20 ప్రపంచకప్‌ నవంబర్‌ 23 నుంచి జరగనుంది. బధిరుల అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (డెఫ్‌ ఐసీసీ) ఆధ్వర్యంలో డెఫ్‌ క్రికెట్‌ సొసైటీ (డీసీఎస్‌) ఈ టోర్నమెంట్‌ను నిర్వహించనుం ది. ఎనిమిది రోజుల పాటు గురుగ్రామ్‌లో ఈ పోటీలు నిర్వహిస్తారు.

8 జట్లు ఈ టోర్నీలో పాల్గొంటాయి. భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికాలను నాలుగు జట్ల చొప్పున రెండు గ్రూపులుగా విభజిస్తారు. ఒక్కో జట్టు లీగ్‌ దశలో మూడు మ్యాచ్‌లు ఆడుతుంది. ఒక్కో గ్రూప్‌ నుంచి రెండేసి జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాÆ 

మరిన్ని వార్తలు