రసవత్తర పోరులో రాజస్తాన్‌ విజయం

12 Apr, 2018 00:45 IST|Sakshi

జైపూర్‌: ఐపీఎల్‌లో భాగంగా ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ 10 పరుగుల(డక్‌వర్త్‌ లూయిస్‌) తేడాతో విజయం సాధించింది. దీంతో రెండు సంవత్సరాల తర్వాత సొంత మైదానంలో ఆడిన తొలి మ్యాచ్‌ గెలుపుతో రాజస్తాన్‌ గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చింది. అంతకముందు వర్షం అంతరాయం కల్గించడంతో మ్యాచ్‌ నిర్వహణ సాధ్యం కాలేదు. రాజస్తాన్‌ రాయల్స్‌ 17.5 ఓవర్లలో 153/5 వద్ద ఉండగా వర్షం పడింది. దాంతో మ్యాచ్‌కు అడ్డంకి ఏర్పడింది.  చివరకు డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం ఆరు ఓవర్లలో 71పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీకి నిర్దేశించారు. రాజస్తాన్‌ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఒత్తిడికి చిత్తయిన ఢిల్లీ ఆరు ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 60 పరుగుల మాత్రమే చేయగలిగింది. దీంతో రాయల్స్‌ సొంత మైదానంలో జరిగిన తొలి మ్యాచ్‌లో విజయకేతనం ఎగురవేసింది. 

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ ముందుగా ఫీల్డింగ్‌ తీసుకుంది. దాంతో బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌ రాయల్స్‌ ఆదిలోనే డీ ఆర్సీ షార్ట్‌(6) వికెట్‌ను కోల్పోయింది. ఆపై బెన్‌ స్టోక్స్‌(16) కూడా నిరాశపరచడంతో రాజస్తాన్‌ 23 పరుగులకే రెండు వికెట్లను చేజార్చుకుంది. ఆ తరుణంలో రహానే-సంజూ శాంసన్‌ల జోడి ఇన్నింగ్స్‌ మరమ్మత్తులు చేపట్టింది. శాంసన్‌(37; 22 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మూడో వికెట్‌కు రహానేతో కలిసి 62 పరుగులు జత చేసిన తర్వాత పెవిలియన్‌ చేరాడు. కాసేపటికి రహానే(45;40 బంతుల్లో 5 ఫోర్లు) నాల్గో వికెట్‌గా ఔటయ్యాడు. ఇక జాస్‌ బట్లర్‌(29;18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఐదో వికెట్‌గా పెవిలియన్‌ చేరడంతో రాజస్తాన్‌ 150 పరుగుల వద్ద ఐదో వికెట్‌ను నష్టపోయింది.,, , ,  
 

>
మరిన్ని వార్తలు