ఢిల్లీ జోరుకు రాజస్తాన్‌ నిలిచేనా?

22 Apr, 2019 19:43 IST|Sakshi

జైపూర్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో మరో రసవత్తర పోరుకు స్థానిక సవాయ్‌ మాన్‌సింగ్‌ మైదానం వేదికయింది. జోరు మీదున్న ఢిల్లీ క్యాపిటల్స్‌తో రాజస్తాన్‌ రాయల్స్‌ తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఢిల్లీ తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన ఢిల్లీ సారథి శ్రేయాస్‌ అయ్యర్‌ రాజస్తాన్‌ను బ్యాటింగ్‌కు అహ్వానించాడు. ఈ మ్యాచ్‌కు రాజస్తాన్‌ ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగుతోంది. కాగా ఢిల్లీ జట్టులో ఒక్క మార్పు చోటుచేసుకుంది. స్పిన్నర్‌ లామ్‌చెన్‌ను తప్పించి క్రిస్‌ మోరిస్‌కు అవకాశం కల్పించింది. 

జోరు మీదున్న ముంబై ఇండియన్స్‌పై సంచలన విజయం నమోదు చేసిన రాజస్తాన్‌ ఆదే ఊపును కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది. స్మిత్‌ సారథ్య బాధ్యతలు చేపట్టిన తొలి మ్యాచ్‌లో సమష్టి విజయం అందుకున్న రాజస్తాన్‌.. ఢిల్లీతో జరిగే మ్యాచ్‌లోనూ రాణించాలని కోరుకుంటోంది. అంతేకాకుండా ఇప్పటినుంచి రాజస్తాన్‌కు ప్రతీ మ్యాచ్‌ చావోరేవో వంటిదే. ఒక్క మ్యాచ్‌ ఓడిపోయిన స్మిత్‌ సేనకు ప్లేఆఫ్‌ ఆశలు సంక్లిష్టమవుతాయి. ఇక ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లేఆఫ్‌కు మరింత చేరువ కావాలని ఢిల్లీ భావిస్తోంది. దీంతో జైపూర్‌లో నేడు ఇరుజట్ల మధ్య జరిగే మ్యాచ్‌ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. 

తుదిజట్లు
ఢిల్లీ క్యాపిటల్స్‌: శ్రేయస్‌ అయ్యర్‌(కెప్టెన్‌), పృథ్వీ షా, శిఖర్‌ ధావన్‌, రిషభ్‌ పంత్‌, కోలిన్‌ ఇన్‌గ్రామ్‌, క్రిస్‌ మోరిస్‌, రుథర్‌ఫర్డ్‌, అక్షర్‌పటేల్‌, కగిసో రబడ, అమిత్‌ మిశ్రా, ఇషాంత్‌ శర్మ

రాజస్తాన్‌ రాయల్స్‌: స్టీవ్‌ స్మిత్‌(కెప్టెన్‌), అజింక్యా రహానే, సంజూ శాంసన్‌, బెన్‌ స్టోక్స్‌, రియాన్‌ పరాగ్‌, టర్నర్‌, స్టువార్టు బిన్ని, శ్రేయాస్‌ గోపాల్‌, జోఫ్రా ఆర్చర్‌, జయదేవ్‌ ఉనాద్కత్‌, కులకర్ణి

మరిన్ని వార్తలు