భారత్ ఖాతాలో మరో స్వర్ణం

14 Apr, 2018 15:44 IST|Sakshi
టేబుల్ టెన్నిస్ ప్లేయర్ మానికా బాత్రా

గోల్డ్‌కోస్ట్‌ : ఆస్ట్రేలియాలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పతకాల వేట కొనసాగిస్తోంది. పదోరోజు ఆటలో భాగంగా భారత క్రీడాకారులు స్వర్ణాల పంట పండిస్తున్నారు. శనివారం ఒక్కరోజే భారత్ 7 స్వర్ణాలు కైవసం చేసుకుంది. టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్‌లో మానికా బాత్రా సింగపూర్‌కు చెందిన మియింగ్యూ యుపై 11-7, 11-6, 11-2, 11-7 తేడాతో విజయం సాధించి త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు. 

స్క్వాష్ మిక్స్‌డ్ డబుల్స్‌లో దీపికా పల్లికల్, సౌరబ్ ఘోశల్‌లు స్వర్ణ పోరులో ఆస్ట్రేలియాకు చెందిన పిల్లే కామెరూన్, ఉరుక్‌హఖ్ డోన్నా చేతిలో 0-2 తేడాతో ఓటమి చెందడంతో రజతాలతో సరిపెట్టుకున్నారు. దీంతో  కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పతకాల సంఖ్య 55కు చేరగా.. అందులో 24 స్వర్ణాలు, 14 రజతాలు, 17 కాంస్యాలున్నాయి. భారత్ మూడో స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లు తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి.

మరిన్ని వార్తలు