ఎంఎస్‌ ధోని మరో ఘనత

6 May, 2018 17:57 IST|Sakshi

పుణె: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని రికార్డుల వేట కొనసాగుతోంది. ఇటీవల ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ జరిగిన మ్యాచ్‌ ద్వారా ఐపీఎల్‌లో అత్యధిక పరుగుల సాధించిన కెప్టెన్‌గా ఘనత సాధించిన ధోని.. శనివారం రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో మరో రికార్డును లిఖించాడు. ఓవరాల్‌ ఐపీఎల్‌లో ధోని వ్యక్తిగతంగా అత్యధిక సిక్సర్లు నమోదు చేసిన రికార్డును సవరించుకున్నాడు. ఈ సీజన్‌లో  ధోని బాదిన సిక్సర్లు 27.

గతంలో 2013లో అత్యధికంగా 25 సిక్సర్లు బాదగా.. అంతకుముందు 2011లో 23 సిక్సర్లు, 2014లో 20 సిక్సర్లు కొట్టాడు. మరొకవైపు ఐపీఎల్‌ -11లో ఇప్పటివరకూ అత్యధిక సిక్సర్లు కొట్టిన క్రికెటర్‌గా ధోని నిలిచాడు.  అతని తర్వాత స్థానంలో క్రిస్‌ గేల్‌(25) ఉన్నాడు. ఇదిలా ఉంచితే, ఓవరాల్‌ ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో ధోని (183 సిక్సర్లతో) మూడో స్థానంలో కొనసాగతున్నాడు. క్రిస్‌ గేల్‌(290), రోహిత్‌ శర్మ (183)లు తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.  ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

>
మరిన్ని వార్తలు