టి20 వరల్డ్‌కప్‌కే నా ప్రాధాన్యత: బోర్డర్‌

23 May, 2020 00:01 IST|Sakshi

మెల్‌బోర్న్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) కేవలం డబ్బుకు సంబంధించిన వ్యవహారమని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ అలెన్‌ బోర్డర్‌ అన్నారు. ఈ ఏడాది టి20 ప్రపంచకప్‌ జరుగనుండగా... ఐపీఎల్‌కు అంతగా ప్రాధాన్యతనివ్వాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఆసీస్‌ వేదికగా అక్టోబర్‌–నవంబర్‌లో జరగాల్సిన వరల్డ్‌కప్‌ వాయిదా పడితే, దాని స్థానంలో ఐపీఎల్‌ జరిగే అవకాశముందని వస్తోన్న వార్తలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఆ వార్తలతో నేను సంతోషంగా లేను. స్థానిక టోర్నీ అయిన ఐపీఎల్‌ కన్నా ఐసీసీ ఈవెంట్‌ వరల్డ్‌కప్‌నకే అధిక ప్రాధాన్యత లభించాలి. ప్రపంచకప్‌ జరిగే పరిస్థితే లేనప్పుడు లోకల్‌ టోర్నీని ఎలా నిర్వహిస్తారు. ఐపీఎల్‌ కేవలం డబ్బుకు సంబంధించినది. ఐపీఎల్‌కు సిద్దమయ్యే ఆటగాళ్లను ఆయా దేశాల బోర్డులు అడ్డుకోవాలి’ అని బోర్డర్‌ అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు