రియోకు ముందే భారత్ కు ఎదురుదెబ్బ!

24 Jul, 2016 11:29 IST|Sakshi
రియోకు ముందే భారత్ కు ఎదురుదెబ్బ!
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్కు ముందే భారత్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత స్టార్ రెజ్లర్ నర్సింగ్ యాదవ్ రియో ఒలింపిక్స్ లో పాల్గొంటాడా లేదా అన్న దానిపై స్పష్టతలేదు. రియోకు ముందు జరిపిన డోపింగ్ టెస్టులో నర్సింగ్ విఫలమయ్యాడని కథనాలు ప్రచారంలో ఉన్నాయి. నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(ఎన్ఏడీఏ) ఈ నెలలో ఆటగాళ్లకు డోపింగ్ టెస్టులు చేసింది. తాజాగా వెలువడిన డోపింగ్ పరీక్షల ఫలితాలలో నర్సింగ్ పాజిటివ్గా తేలినట్లు సమాచారం. అతడి నుంచి తీసుకున్న శాంపిల్ 'బి'లో కూడా నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్లు తేలింది.
 
నర్సింగ్ సమక్షంలోనే ఎన్ఏడీఏ శాంపిల్ 'బి' టెస్టులు చేసింది. పూర్తి నివేదిక రాగానే నర్సింగ్ను రియో పంపాలా.. వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే భారత రెజ్లింగ్ సమాఖ్య ఇప్పటివరకూ నర్సింగ్ యాదవ్ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఆగస్టు 5 నుంచి 21 వరకు జరగనున్న రియో ఒలింపిక్స్ లో 74 కేజీల విభాగంలో భారత్ తరఫున నర్సింగ్ బరిలో దిగనున్న విషయం తెలిసిందే.
మరిన్ని వార్తలు