ఆసియాకప్‌ : పాక్‌దే బ్యాటింగ్‌

23 Sep, 2018 16:51 IST|Sakshi

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పాకిస్తాన్‌

ఎలాంటి మార్పుల్లేకుండా బరిలోకి దిగుతున్న భారత్‌

దుబాయ్: ఆసియాకప్‌ సూపర్‌-4లో భాగంగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఎలాంటి మార్పుల్లేకుండా టీమిండియా బరిలోకి దిగుతుండగా.. పాకిస్తాన్‌ జట్టులో స్వల్పమార్పులు చోటు చేసుకున్నాయి. హారిస్‌ సోహైల్‌, ఉస్మాన్‌ ఖాన్‌ స్థానాల్లో  మహ్మద్‌ ఆమిర్‌, షాదబ్‌ ఖాన్‌లు తుదిజట్టులోకి వచ్చారు. టాస్‌ గెలిచిన పాక్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌.. బ్యాటింగ్‌కు మొగ్గుచూపాడు. ‘ఈ పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది. మేం 250పైగా పరుగులు చేయాలనుకుంటున్నాం’ అని తెలిపాడు.

ఇక భారత తాత్కలిక కెప్టెన్‌ మాత్రం తమపై ఎలాంటి ఒత్తిడి లేదని పేర్కొన్నాడు. గత మ్యాచ్‌ల్లోలానే తమ ఆటను పునరావృతం చేస్తామన్నాడు. ఈ టోర్నీ లీగ్‌ మ్యాచ్‌లో దారుణంగా ఓడిన పాక్‌ ఈ మ్యాచ్‌ గెలిచి భారత్‌పై ప్రతికారం తీర్చుకోవాలని భావిస్తోంది. వరుస విజయాలతో ఉత్సాహంగా ఉన్న టీమిండియా తమ జైత్రయాత్రను కొనసాగించాలని ఉవ్విళ్లురుతోంది. 

జట్లు 
భారత్‌: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), ధావన్, రాయుడు, ధోని, కార్తీక్, కేదార్‌ జాదవ్, జడేజా, భువనేశ్వర్, కుల్దీప్, చహల్, బుమ్రా.
పాకిస్తాన్‌: సర్ఫరాజ్‌ అహ్మద్‌ (కెప్టెన్‌), ఫఖర్‌ జమాన్, ఇమాముల్‌ హక్, బాబర్‌ ఆజమ్, షోయబ్‌ మాలిక్, ఆసిఫ్‌ అలీ, నవాజ్, హసన్‌ అలీ, షాహీన్‌ ఆఫ్రిది, మహ్మద్‌ ఆమిర్‌, షాదబ్‌ ఖాన్‌ 

మరిన్ని వార్తలు