ఆస్ట్రేలియా ఓపెన్‌: తొలి రౌండ్‌లోనే ప్రజ‍్నేశ్‌ ఓటమి

14 Jan, 2019 12:24 IST|Sakshi

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియా ఓపెన్‌ మెయిన్‌ డ్రాకు అర్హత సాధించడం ద్వారా ఒక గ్రాండ్‌ స్లామ్‌ టోర్నీలో తొలిసారి పాల్గొన్న భారత  టెన్నిస్‌ ఆటగాడు ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్‌కు  తొలి రౌండ్‌లోనే నిరాశ ఎదురైంది. పురుషుల సింగిల్స్‌లో భాగంగా జరిగిన మొదటి రౌండ్‌ పోరులో 39వ ర్యాంకర్‌ టియాఫో(అమెరికా) చేతిలో 7-6(9/7), 6-3, 6-3 తేడాతో ప్రజ్నేశ్‌ పరాజయం చెందాడు. తొలి సెట్‌లో ప్రజ్నేశ్‌ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ కడవరకూ పోరాడటంలో విఫలం చెందడంతో  ఓటమి తప్పలేదు.

ఇరువురి మధ్య జరిగిన తొలి సెట్‌ టైబ్రేక్‌కు దారి తీయగా అందులో టియాఫో పోరాడి గెలిచాడు. ఆపై వరుస రెండు సెట్లలో ప్రజ్నేశ్‌ ప‍్రతిఘటించలేకపోవడంతో ఓటమి తప్పలేదు. టియాఫో 88 శాతం నెట్‌ పాయింట్లు గెలవగా, ప్రజ్నేశ్‌ 67 శాతం నెట్ పాయింట్లు మాత్రమే గెలవగలిగాడు. మరొకవైపు టియాఫో కంటే ప్రజ్నేశ్ అనవసర తప్పిదాలను ఎక్కువగా చేయడంతో మూల్యం చెల్లించుకున్నాడు. దాంతో ప్రజ‍్నేశ్‌ భారంగా ఆస్ట్రేలియా ఓపెన్‌ ముగించి ఇంటిదారి పట్టాడు.  తొలి రౌండ్‌లోనే గెలిచిన టియాఫో.. రెండో రౌండ్‌లో ఐదో సీడ్‌ కెవిన్‌ అండర్సన్‌(దక్షిణాఫ్రికా)తో తలపడనున్నాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు