కోహ్లి సేనకు సాధారణ లక్ష్యం

29 Apr, 2017 17:46 IST|Sakshi
కోహ్లి సేనకు సాధారణ లక్ష్యం

పుణె: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్ లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ 158 పరుగుల సాధారణ లక్ష్యాన్ని నిర్దేశించింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్(45;32 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకోగా,  రాహుల్ త్రిపాఠి(37;28 బంతుల్లో4 ఫోర్లు, 1 సిక్స్), మనోజ్ తివారీ(44 నాటౌట్; 35 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) బాధ్యాతయుతంగా ఆడారు.  ఇక చివర్లో మహేంద్ర సింగ్ ధోని(21 నాటౌట్; 17 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్)  ఫర్వాలేదనిపించడంతో పుణె గౌరవప్రదమైన స్కోరు సాధించింది.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన పుణెకు ఆదిలోనే అజింక్యా రహానే(6) వికెట్ ను కోల్పోయింది. ఆ తరుణంలో త్రిపాఠికి జత కలిసిన స్టీవ్ స్మిత్ ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించాడు. క్రీజ్ లోకి వచ్చీ రావడంతోనే స్మిత్ బ్యాట్ ఝుళిపించడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. అయితే స్టువర్ట్ బిన్నీ వేసిసన 14 ఓవర్ చివరి బంతికి స్మిత్ అవుట్ అయ్యాడు. దాంతో పుణె స్కోరులో వేగం తగ్గింది. ఆపై మనోజ్ తివారి-మహేంద్ర సింగ్ ధోనిలు మెల్లగా ఇన్నింగ్స్ ను నిర్మించారు. అయితే ఆఖరి ఓవర్లలో పుణె సాధ్యమైనన్ని ఎక్కువ పరుగుల్ని సాధించడంలో విఫలం కావడంతో నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 157 పరుగులు మాత్రమే చేసింది. ఆర్సీబీ బౌలర్లలో సమిష్టగా రాణించి పుణెను భారీ స్కోరు చేయకుండా అడ్డుకోగలిగారు.

>
మరిన్ని వార్తలు