క్వార్టర్స్‌లో భారత జట్లకు నిరాశ 

10 Feb, 2018 00:27 IST|Sakshi
సింధు

సింగిల్స్‌లో నెగ్గిన సింధు, శ్రీకాంత్‌

అలోర్‌ సెటార్‌ (మలేసియా): ఆసియా టీమ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో భారత మహిళల, పురుషుల జట్ల పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్స్‌లో భారత మహిళల జట్టు 1–3తో ఇండోనేసియా చేతిలో... భారత పురుషుల జట్టు 1–3తో చైనా చేతిలో ఓడిపోయాయి. మహిళల తొలి సింగిల్స్‌లో సింధు 21–13, 24–22తో ఫిత్రియానిపై గెలుపొంది భారత్‌కు 1–0  ఆధి క్యాన్ని అందించింది. అయితే డబుల్స్‌లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప జంట, సింధు–సంయోగిత జోడీ, సింగిల్స్‌లో శ్రీకృష్ణప్రియ ఓడిపోవడంతో భారత్‌ ఓటమి ఖాయమైంది. 

పురుషుల విభాగం తొలి మ్యాచ్‌లో  శ్రీకాంత్‌ 14–21, 21–16, 21–7తో షి యుకిపై నెగ్గి భారత్‌ను 1–0 ఆధిక్యంలో నిలిపాడు. అయితే రెండో మ్యాచ్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి జంట, మూడో మ్యాచ్‌లో సాయిప్రణీత్, నాలుగో మ్యాచ్‌లో సుమీత్‌ రెడ్డి–మనూ అత్రి ద్వయం పరాజయం పొందడంతో భారత్‌కు నిరాశ తప్పలేదు.   

మరిన్ని వార్తలు