దుబాయ్‌లో సీనియర్‌తో జూనియర్‌!

26 Dec, 2019 10:43 IST|Sakshi

క్రిస్మస్‌ పర్వదినాన్ని సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కొందరు సెలబ్రిటీలు సన్నిహితులు, స్నేహితులతో కలిసి క్రిస్మస్‌ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. అదేవిధంగా క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకొని ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రిస్మస్ అందరికీ సంతోషాన్ని కలిగించాలని వారు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. కాగా, టీమిండియా యువ సంచలనం రిషభ్‌ పంత్‌ ఈ సారి క్రిస్మస్ వేడకులను మాజీ కెప్టెన్‌, సీనియర్‌ క్రికెటర్‌ ఎంఎస్‌ ధోనితో కలిసి జరుపుకున్నాడు. 

క్రిస్మస్‌ సెలబ్రేషన్స్‌ కోసం సీనియర్‌ క్రికెటర్‌ ఎంఎస్‌ ధోని దుబాయ్‌ వెళ్లాడు. ధోనితో పాటు అతడి స్నేహితులు, పంత్‌ కూడా వెళ్లి తెగ ఎంజాయ్‌ చేశారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతున్నాయి. ‘జూనియర్‌ అండ్‌ సీనియర్‌ ఎట్‌ క్రిస్మస్‌ సెలబ్రేషన్స్‌’అంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. ఇక ధోని, పంత్‌ల మధ్య మంచి సాన్నిహిత్యం ఉన్న విషయం తెలిసిందే. ప్రసుతం టీమిండియా సెలక్షన్స్‌కు దూరంగా ఉంటున్న ధోనిని పంత్‌ తరుచూ కలుస్తున్నాడు. కుటుంబ స్నేహితుడిగా అదేవిధంగా ఆట పరమైన టెక్నిక్‌లు తెలసుకోవడానికి సీనియర్‌ క్రికెటర్‌ను జూనియర్‌ క్రికెటర్‌ కలుస్తున్నాడని వారిద్దిరి సన్నిహితులు పేర్కొంటున్నారు. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

గావస్కర్‌ విరాళం రూ. 59 లక్షలు

102 ట్రోఫీలు... 102 వ్యక్తులకు విక్రయించి...

ప్రాణాలకంటే ఆటలు ఎక్కువ కాదు

'కరోనా వెళ్లిపోయాకా ఇద్దరం కలిసి హార్స్‌ రైడ్‌ చేద్దాం'

‘అతడి ముచ్చటంటే కోహ్లికి ఇష్టమంటా’

సినిమా

ఈ రోజు నాకు ఎంతో ప్రత్యేకం: చిరంజీవి

రియల్‌ 'హీరో'ల్‌

నిఖిల్‌ పెళ్లి ఈ నెల 17నే

పెద్దాయన సన్‌ గ్లాసెస్‌ వెతకండ్రా

రూ.1.25 కోట్ల విరాళం ప్ర‌క‌టించిన అజిత్‌

టిక్‌టాక్ వీడియోపై ర‌ష్మి ఆగ్ర‌హం