శ్రీశాంత్‌కు శిక్ష ఎంత?

6 Apr, 2019 01:46 IST|Sakshi

అంబుడ్స్‌మన్‌ చేతుల్లో నిర్ణయం

న్యూఢిల్లీ:  స్పాట్‌ ఫిక్సింగ్‌కు పాల్పడిన పేసర్‌ శ్రీశాంత్‌కు శిక్ష తగ్గించే విషయంపై ఆలోచించాలని బీసీసీఐకి సూచించిన సుప్రీం కోర్టు ఆ అధికారాన్ని అంబుడ్స్‌మన్‌కు అప్పగించింది. మూడు నెలల్లోగా శ్రీశాంత్‌ శిక్ష విషయంలో బీసీసీఐ అంబుడ్స్‌మన్‌ జస్టిస్‌ డీకే జైన్‌ నిర్ణయం తీసుకుంటారని శుక్రవారం సుప్రీం కోర్టు వెల్లడించింది.

2013 ఐపీఎల్‌లో స్పాట్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలు రావడంతో శ్రీశాంత్‌పై బీసీసీఐ జీవిత కాల నిషేధం విధించింది. దీనిపై అతను కోర్టుకెక్కగా... ఇటీవలే శిక్ష తగ్గించే విషయం ఆలోచించాలని బీసీసీఐకి సుప్రీం కోర్టు సూచించింది.    

మరిన్ని వార్తలు