ఆ ఫుట్‌బాల్‌ క్రీడాకారిణి ‘వండర్‌ వుమెన్‌’!

26 Feb, 2020 20:46 IST|Sakshi

క్రీడాకారులు అనుకోకుండా కొన్నిసార్లు గాయాలపాలవుతారు. ఆడుతున్న క్రమంలో తీవ్రంగా గాయపడితే వైద్యులు వారిని గ్రౌండ్‌ నుంచి తీసుకువెళ్తారు. కొంత మంది క్రీడాకారులు గాయమవడంతో విలవిల్లాడుతూ..  మైదానంలో కుప్పకూలిపోతారు. కానీ ఓ ఫుట్‌బాల్‌ క్రీడాకారిణి మాత్రం తనకు తగిలిన గాయాన్ని సైతం లెక్కచేకుండా మళ్లీ ఆటను కొనసాగించారు. వివరాలు.. స్కాటిష్‌ మహిళల ఛాంపియన్‌షిప్‌ కప్‌లో సెయింట్ మిర్రెన్ మహిళల జట్టు.. ఇన్వర్నెస్ కాలెడోనియన్ తిస్టిల్ జట్టుకు మధ్య ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ జరిగింది. రసవత్తరంగా సాగుతున్న ఈ మ్యాచ్‌లో స్కాటిష్ ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ జేన్ ఓ టూల్ ప్రత్యర్థితో బాల్‌కోసం తలపడుతూ ఒక్కసారి తన మోకాలు నేలకు గట్టిగా తగలగా కిందిపడిపోయారు. దీంతో తన మోకాలు చిప్ప పక్కకు జరిగింది. దీంతో జేన్‌ ఓ టూల్‌ ఏమాత్రం భయపడకుండా నొప్పిని దిగమింగుతూ.. మోకాలు చిప్ప తిరిగి అదేస్థానంలోకి తీసుకురావడానికి తన చేతితో గట్టిన కొడుతూ సరిచేసుకున్నారు. ఆ తర్వాత కూడా తను మరో 90 నిమిషాలు ఆడారు.

జేన్‌ ఓ టూల్‌కి చెందిన ఈ  వీడియోను సెయింట్ మిర్రెన్ ఫుట్‌బాల్‌ జట్టు తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. ‘మా కెప్టెన్‌ ఎంత కఠినమైన పరిస్థితులను అయినా ఎదుర్కొంటారు. ఇటీవల ఇన్వర్నెస్‌ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో తన మోకాలి చిప్పకు గాయం తగిలినా కూడా తను ఎలా వ్యవహరించారలో చూడండి. శక్తివంతమైన స్త్రీని ఎవరు అణచివేయలేరు’ అని కాప్షన్‌ పెట్టింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆమె ధైర్యాన్ని ప్రశంసించారు. ‘వండర్‌ వుమెన్‌’ అని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. ‘పురుష ఫుట్‌బాల్‌ క్రీడారులు ఆమె నుంచి చాలా నేర్చుకోవాలి’ అని మరో నెటిజన్‌ అన్నారు. ‘నేను ఈ వీడియో చూసి పసిపాపలా ఏడ్చాను’ అని మరో నెటిజన్‌ పేర్కొన్నారు. ఈ మ్యాచ్‌ ఫిబ్రవరి 21న జరిగింది.ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. 

మరిన్ని వార్తలు