టాప్‌–4లో నిలవడమే లక్ష్యం

2 Apr, 2017 01:50 IST|Sakshi
టాప్‌–4లో నిలవడమే లక్ష్యం

యాయా టురీ ఇంటర్వ్యూ
మాంచెస్టర్‌ జట్టులో కీలక ఆటగాడు యాయా టురీ. ఏడేళ్లుగా ఈ జట్టుతో అనుబంధమున్న అతను... ఈ సీజన్‌లో టైటిల్‌ అవకాశాలు దాదాపు కోల్పోవడంతో ఇక జట్టును టాప్‌–4లో నిలపడమే లక్ష్యమని చెప్పాడు. ఇంగ్లిష్‌ ప్రీమియర్‌ లీగ్‌లో తదుపరి అర్సెనల్‌తో జరిగే మ్యాచ్‌లో రాణిస్తామన్నాడు. ఈ సీజన్‌ ముగిసిన వెంటనే జరిగే ఎఫ్‌ఏ కప్‌లో మాంచెస్టర్‌ సిటీకి టైటిల్‌ అందించేందుకు శ్రమిస్తామని చెప్పిన టురీ ఇంకా ఎమన్నాడంటే...

టైటిల్‌ అవకాశాలు కోల్పోయిన నేపథ్యంలో ఇక సీజన్‌లో మీ తదుపరి టార్గెట్‌ ఏంటి?
ఈ సీజన్‌లో జట్టును మెరుగైన స్థితిలో నిలపడమే మా ముందున్న లక్ష్యం. టైటిల్‌ అవకాశాలు చేజారినంత మాత్రాన మిగతా మ్యాచ్‌లపై అలసత్వమేమీ ఉండదు. మా పోరాటంలో మార్పు ఉండదు. ఈ చాంపియన్స్‌ లీగ్‌లో తొలి నాలుగు స్థానాల్లో మా జట్టును నిలుపుతాం. మా అభిమానులకు ఆ తృప్తి అయినా మిగిలిస్తాం.

అర్సెనల్‌తో జరిగే తదుపరి మ్యాచ్‌ మీకు కీలకమనే భావిస్తున్నారా?
ఆటలో ప్రతి మ్యాచ్, ఫలితం కీలకమైనదే. ఈ సీజన్‌లో మేం సొంతగడ్డపై కంటే బయటే బాగా ఆడాం. ఇతర వేదికలపై స్వేచ్ఛగా ఆడేందుకు పరిస్థితులు కలిసొచ్చా యి. ఈ లీగ్‌లో మిగిలిన మ్యాచ్‌ల్లో గెలిచి పాయింట్ల పట్టికలో ముందడుగు వేస్తాం.

ఇప్పుడున్న పరిస్థితుల్లో చెల్సీ జట్టునెవరూ చేరుకోలేరా?
నిజమే. మిగతా జట్లన్ని చెల్సికి చాలా దూరంలో ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ జట్టు ఆధిక్యానికి ఢోకా లేదు. అలాగని మిగిలిన జట్లు నిరాశ పడాల్సిన పనిలేదు. సాధ్యమైనంత వరకు స్థిరమైన విజయాలతో గట్టి పోటీనిచ్చేందుకు చెమటోడ్చాలి.

వచ్చే సీజన్‌లోనైనా మాంచెస్టర్‌ మెరుగైన స్థితిలో నిలుస్తుందా?
టాప్‌లో ఉండాలనే ఆశిస్తున్నా. ప్రస్తుత మేనేజర్‌ మౌరిన్హో మార్గదర్శనంలోనే వచ్చే సీజన్‌కూ సిద్ధమవుతాం. జట్టు కోసం ఆయన చాలా కష్టపడ్డారు. భవిష్యత్తులో పటిష్టమైన జట్టుగా మాంచెస్టర్‌ సిటీ బరిలోకి దిగుతుంది.

>
మరిన్ని వార్తలు