ధావన్‌ వదిలేశాడు..!

8 Mar, 2019 14:49 IST|Sakshi

రాంచీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా ఫీల్డింగ్‌ పేలవంగా ఉంది. టాస్‌ గెలిచిన టీమిండియా ముందుగా ఫీల్డింగ్‌ తీసుకుంది. దాంతో బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ ఇన్నింగ్స్‌ను అరోన్‌ ఫించ్‌, ఖాజాలు ఆరంభించారు. అయితే ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లోనే భారత్ రివ్యూను కోల్పోయింది. బుమ్రా వేసిన ఆ ఓవర్‌ ఐదో బంతి..  ఫించ్‌ వెనుక కాలి ప్యాడ్లకు తాకింది. దీనిపై భారత అప్పీల్‌ చేయగా ఫీల్డ్‌ అంపైర్‌ తిరస్కరించాడు. దాంతో భారత్‌ రివ్యూకు వెళ్లింది. ఆ బంతి వికెట్ల పైనుంచి వెళుతుందని తేలడంతో భారత్‌ రివ్యూ కోల్పోయింది.

కాగా, జడేజా వేసిన ఏడో ఓవర్‌ నాల్గో బంతికి ఖాజా ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఆ బంతిని ఖాజా రివర్స్‌ స్వీప్‌ ఆడగా అది బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌లో ఉన్న ధావన్‌ చేతుల్లో పడింది. అయితే ఆ సునాయాసమైన క్యాచ్‌ను ధావన్‌ వదిలేయడంతో ఖాజాకు లైఫ్‌ లభించింది. అంతకుముందు బుమ్రా వేసిన ఆరో ఓవర్‌లో చివరి బంతి ఎడ్జ్‌ తీసుకుని ఫోర్‌కు పోయింది. ఆ సమయంలో స్లిప్‌లో ఫీల్డర్లు ఎవరూ లేకపోవడం ఖాజాకు కలిసొచ్చింది. ఈ రెండింటిని సద్వినియోగం చేసుకున్న ఖాజా హాఫ్‌ సెంచరీ సాధించాడు. మరొకవైపు అరోన్‌ ఫించ్‌ కూడా అర్థ శతకం నమోదు చేయడంతో ఆసీస్‌  19 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 121 పరుగులు చేసింది.

ఇక్కడ చదవండి: అమర జవాన్లకు టీమిండియా ఘన నివాళి

మరిన్ని వార్తలు