ప్రపంచకప్‌ వాయిదా.. పాక్‌కు కడుపు మంట

28 May, 2020 09:47 IST|Sakshi

ఇస్లామాబాద్‌: అందరూ భావించినట్లే ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌ వాయిదా పడనుంది. గురువారం అన్ని దేశాల బోర్డు సభ్యులతో నిర్వహించనున్న టెలీ కాన్ఫరెన్స్‌ అనంతరం ఐసీసీ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే ప్రపంచకప్‌ వాయిదా పడనుండటంతో అక్టోబర్‌, నవంబర్‌ మాసాల్లో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ ‌(ఐపీఎల్‌) నిర్వహించుకోవడానికి మార్గం సుగుమం అయినట్లేనని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక టీ20 ప్రపంచకప్‌ వాయిదా పడినదానికంటే ఐపీఎల్‌ జరిగే అవకాశం ఉండటాన్ని పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) జీర్ణించుకోలేకపోతుంది. (వాయిదా వైపే అడుగులు)

‘టీ20 ప్రపంచకప్‌కు ఇంకా సమయం ఉంది. ఇది మే నెలనే ఇంకా కనీసం రెండు నెలలైన వేచిచూడాలి.  రెండు నెలల తర్వాత కరోనా పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. తొందరపాటుగా ఇప్పుడే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు. పరిస్థితులు అనుకూలంగా ఉంటే క్రికెట్‌ క్యాలెండర్‌ ప్రకారం పాక్‌, విండీస్‌ జట్లు ఇంగ్లండ్‌లో సిరీస్‌ ఆడే అవకాశం ఉంది. ఇక ఐపీఎల్‌ అనేది ఓ దేశీయ టోర్నీ. దానిని బీసీసీఐ నిర్వహిస్తోంది ఐసీసీ కాదు. టీ20 ప్రపంచకప్‌ వాయిదా పడితే ఆ సమయాన్ని ఐపీఎల్‌కు కేటాయిస్తామంటే మేం వ్యతిరేకిస్తాం. ఐసీసీ ఈవెంట్స్‌, ద్వైపాక్షిక సిరీస్‌లకు మాత్రమే మేము ప్రాధాన్యత ఇస్తాము. వాటి స్థానాల్లో దేశీయ టోర్నీలకు మేం మద్దతివ్వం’ అంటూ పీసీబీకి చెందిని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. ఇక పీసీబీకి ప్రపంచకప్‌ వాయిదా పడుతుందనే బాధ లేదని ఐపీఎల్‌ నిర్వహిస్తారనే కడుపు మంట ఉందని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు.  (ధోని రిటైర్మెంట్‌పై సాక్షి ట్వీట్‌.. డిలీట్‌)

మరిన్ని వార్తలు