జాతీయ పోటీలకు తేజస్విని

23 Oct, 2017 10:41 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌జీఎఫ్‌) రాష్ట్ర స్థాయి స్కేటింగ్‌ చాంపియన్‌షిప్‌లో రెయిన్‌బో ఇంటర్నేషనల్‌ స్కూల్‌ విద్యార్థిని జీఎస్‌టీ తేజస్విని సత్తా చాటింది. ఇందిరాపార్క్‌లో ఆదివారం జరిగిన ఈ టోర్నమెంట్‌లో రెండు స్వర్ణ పతకాలను కైవసం చేసుకుంది. ఈ గెలుపుతో బెల్గామ్‌లో జరిగే జాతీయ స్థాయి స్కేటింగ్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే రాష్ట్ర జట్టుకు ఎంపికైంది.  
 

మరిన్ని వార్తలు