ఖ్వాజా క్యాచ్‌.. కోహ్లి షాక్‌

6 Dec, 2018 09:29 IST|Sakshi

అడిలైడ్‌ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి కేవలం 3 పరుగులకే అవుటయ్యాడు. ఆస్ట్రేలియా ఫీల్డర్‌ ఉస్మాన్‌ ఖవాజా అనూహ్య క్యాచ్‌తో అతడు త్వరగా పెవిలియన్‌ చేరాడు.

ఎప్పట్లానే నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ దిగిన కోహ్లి 16 బంతుల్లో 3 పరుగులు చేశాడు. 11 ఓవర్‌ మూడో బంతికి కోహ్లి అవుటయ్యాడు. పాట్‌ కమిన్స్‌ వేసిన వైడ్‌ బాల్‌ను అవుట్‌సైట్‌ బాదాడు. బౌండరీ వైపు దూసుకుపోతున్న బంతిని ఊహించనివిధంగా ఎడమవైపు డైవ్‌ చేసి ఉస్మాన్‌ ఖవాజా ఒంటిచేత్తో ఒడిసిపట్టాడు. కష్టమైనసాధ్యమైన క్యాచ్‌ పట్టి కోహ్లిని అవాక్కయ్యేలా చేశాడు. కోహ్లి నిరాశగా పెవిలియన్‌ చేరాడు. మైదానంలోని సహచరులంతా ఖవాజాను అభినందనలతో ముంచెత్తారు. ఆట మొదటి సెషనల్‌లో ఖవాజా పట్టిన క్యాచ్‌ హైలెట్‌గా నిలిచింది.
 

మరిన్ని వార్తలు