ఐపీఎల్‌ చరిత్రలో ఆరో క్రికెటర్‌గా..

6 May, 2018 19:08 IST|Sakshi

ముంబై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఆటగాడు రాబిన్‌ ఉతప్ప అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్‌ చరిత్రలో నాలుగు వేల పరుగుల మార్కును దాటిన ఆరో క్రికెటర్‌గా ఉతప్ప నిలిచాడు. ఆదివారం ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఉతప్ప ఈ ఫీట్‌ను సాధించాడు. కేకేఆర్‌ ఇన్నింగ్స్‌లో భాగంగా ముంబై బౌలర్‌ మార్కండే వేసిన ఎనిమిదో ఓవర్‌ ఐదో బంతికి ఉతప్ప సిక్స్‌ కొట్టి నాలుగు వేల పరుగుల క్లబ్‌లో చేరాడు. ఉతప్ప 153 ఇన్నింగ్స్‌ల్లో నాలుగు వేల పరుగులు సాధించాడు.

ఐపీఎల్‌లో నాలుగు వేల పరుగుల మార్కును దాటిన ఆటగాళ్లలో డేవిడ్‌ వార్నర్‌(114 ఇన్నింగ్స్‌ల్లో), విరాట్‌ కోహ్లి(128 ఇన్నింగ్స్‌), సురేశ్‌ రైనా(140  ఇన్నింగ్స్‌ల్లో), గౌతం గంభీర్‌( 140 ఇన్నింగ్స్‌ల్లో), రోహిత్‌ శర్మ(147 ఇన్నింగ్స్‌ల్లో)లు ఉన్నారు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు