టీ20 చరిత్రలో విండీస్‌ ఆరోసారి

5 Nov, 2018 13:33 IST|Sakshi

కోల్‌కతా: ధనాధన్‌ క్రికెట్‌కు మరో పేరు టీ20 ఫార్మాట్‌. ఈ ఫార్మాట్‌లో క్రికెటర్లు పరుగుల దాహంతో చెలరేగితే అది అభిమానుల్లో మంచి మజాను నింపుతోంది. మరి అటువంటి టీ20 మ్యాచ్‌ కాస్తా ఏదో పేలవంగా సాగితే మాత్రం ఫ్యాన్స్‌లో తీవ‍్ర నిరాశను మిగుల‍్చుతుంది. ప్రధానంగా సిక్సర్లు కొట్టడంలో ఆటగాళ్లు సక్సెస్‌ కాలేకపోతే అది మరింత నిరుత్సాహపరుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ తరహాలోనే సాగింది  కోల్‌కతాలోని ఈడెన్‌లో భారత్‌-వెస్టిండీస్‌ల మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్‌.  ఇరు జట్లు కలిసి కేవలం రెండు సిక్సర్లే కొట్టడంతో మ్యాచ్‌లో ఎటువంటి జోష్‌ను తీసుకురాలేదు.

ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ కేవల సిక్స్‌ మాత్రమే కొట్టింది. 20 ఓవర్లపాటు ఆడిన విండీస్‌ 8 వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసింది. ఇందులో 13 ఫోర్లు నమోదైతే, ఒకే ఒక్క సిక్స్‌ రావడం గమనార్హం. ఈ సిక్సర్‌ను పొలార్డ్‌ కొట్టాడు. ఇలా విండీస్‌ సిక్స్‌ మాత్రమే సాధించడం ఆ జట్టు టీ 20 చరిత్రలో ఆరోసారి మాత‍్రమే. అంతకుముందు న్యూజిలాండ్‌(2006), శ్రీలంక(2009(, జింబాబ్వే(2010), శ్రీలంక(2010), పాకిస్తాన్‌(2016)లతో జరిగిన టీ20 మ్యాచ్‌ల్లో విండీస్‌ ఒక్కో సిక్స్‌ మాత్రమే సాధించింది. కాగా, విండీస్‌తో లక్ష్యాన్ని ఛేదించే క‍్రమంలో బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఇన‍్నింగ్స్‌లో కూడా సిక్స్‌ మాత్రమే కొట్టింది.

మరిన్ని వార్తలు