అదే మైదానంలో ద్రవిడ్‌కు సైతం.. వీడియో వైరల్‌

4 Jan, 2020 12:16 IST|Sakshi

న్యూఢిల్లీ:  టీమిండియా మాజీ కెప్టెన్‌ రాహుల్‌ ద్రవిడ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అటు మిస్టర్‌ డిఫెండబుల్‌గా పిలుచుకునే ద్రవిడ్‌కు ‘ ద వాల్‌’ అనే పేరు కూడా ఉంది. క్రీజ్‌లో ద్రవిడ్‌ ఉన్నాడంటే ప్రత్యర్థి బౌలర్లకు చెమటలు పట్టాల్సిందే. క్రికెట్‌ పుస్తకాల్లోని అచ్చమైన షాట్లతో మెరిపించిన ద్రవిడ్‌ బౌలర్లకు అంత తేలిగ్గా లొంగేవాడు కాదు. తనదైన బ్యాటింగ్‌ శైలితో బౌలర్లకు కొరకరాని కొయ్యగా ఉండేవాడు. తాను క్రికెట్‌ ఆడిన సమయంలో భారత క్రికెట్‌ జట్టుకు వెన్నుముకగా నిలిచిన ద్రవిడ్‌..ఆసీస్‌ వంటి ఫాస్ట్‌ బౌలింగ్‌ ఎటాక్‌ జట్లను సైతం ముప్పు తిప్పలు పెట్టేవాడు. ఇదిలా ఉంచితే, సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌లో న్యూజిలాండ్‌తో చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ క్రికెటర్‌ స్టీవ్‌ స్మిత్‌ తొలి పరుగును తీయడానికి 39 బంతులు ఎదుర్కొన్న సందర్భంలో ద్రవిడ్‌ మరొకసారి హైలైట్‌ అయ్యాడు.

ప్రస్తుతం నేషనల్‌ క్రికెట్‌ అకాడమీకి డైరెక్టర్‌గా ఉన్న ద్రవిడ్‌.. 2008లో ఆస్ట్రేలియాతో  జరిగిన మ్యాచ్‌లో పరుగు చేయడానికి 40 బంతులు తీసుకున్నాడు.  ద్రవిడ్‌ 18 పరుగులు చేసిన అనంతరం మరో పరుగు తీయడానికి సుదీర్ఘంగా నిరీక్షించాడు. బ్రెట్‌ లీ వంటి ఫాస్ట్‌ బౌలర్ల ఔట్‌ స్వింగ్‌, ఇన్‌ స్వింగ్‌ బంతులను ఆచితూచి ఆడే క్రమంలో ద్రవిడ్‌కు నిరీక్షణ తప్పలేదు. అయితే  సింగిల్‌ తీసి 19వ వ్యక్తిగత పరుగును సాధించిన తర్వాత ద్రవిడ్‌కు అభిమానులు చప్పుట్లతో అభినందించడం విశేషం.  ఇప్పుడు స్మిత్‌ సింగిల్‌ తీయడానికి 39 బంతులు తీసుకున్న తర్వాత స్టేడియ దద్దరిల్లింది. అప్పుడు కూడా ద్రవిడ్‌ ఈ తరహా అభినందనే లభించింది. కాగా, ఈ రెండు సందర్భాల్లో సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌ వేదిక కావడం విశేషం.(ఇక్కడ చదవండి: 45 నిమిషాలు.. 39 బంతులు)

మరిన్ని వార్తలు