వింబుల్డన్‌: బార్టీ అలవోకగా..

2 Jul, 2019 21:31 IST|Sakshi

రెండో రౌండ్‌లోకి ప్రవేశం

వింబుల్డన్‌ టోర్నీ

లండన్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌ విజేత, మహిళల సింగిల్స్‌లో తాజా నెం.1 ఆష్లే బార్టీ (ఆస్ట్రేలియా) ప్రతిష్టాత్మక వింబుల్డన్‌ టోర్నీలో శుభారంభం చేసింది. మంగళవారం తొలి రౌండ్‌ మ్యాచ్‌లో బార్టీ 6–4, 6–2తో జంగ్‌ (చైనా)పై అలవోకగా గెలుపొంది రెండో రౌండ్‌కు చేరుకుంది. మహిళల సింగిల్స్‌లోని ఇతర ప్రధాన మ్యాచ్‌ల్లో తొమ్మిదో సీడ్‌ స్లోన్‌ స్టీఫెన్స్‌(అమెరికా) 6–2, 6–4తో బిసిన్‌స్కీ (స్విట్జర్లాండ్‌) పై, మాజీ నెం.1, ఐదో సీడ్‌ ఏంజెలిక్‌ కెర్బర్‌ (జర్మనీ) 6–4, 6–3తో మరియ (జర్మనీ)పై, వరల్డ్‌ నెం.13 బెనిసిచ్‌ (స్విట్జర్లాండ్‌) 6–2, 6–3తో పవ్లిచెంకోవా(రష్యా)పై గెలుపొందారు. 

పురుషుల సింగిల్స్‌లో ఎనిమిదో సీడ్‌ నిషికోరి(జపాన్‌) 6–4, 7–6(7/3), 6–4తో మౌంటెరియో(బ్రెజిల్‌)పై, నిక్‌ కిర్గియోస్‌ (ఆస్ట్రేలియా) 7–6(7/4), 3–6, 7–6(12/10), 0–6, 6–1తో తమ దేశానికే చెందిన జె.థాంప్సన్‌పై చెమటోడ్చి నెగ్గగా, ఐదో సీడ్‌ డొమెనిక్‌ థీమ్‌ (ఆస్ట్రియా) 7–6(7/4), 6–7(1/7), 3–6, 0–6తో అన్‌ సీడెడ్‌ క్వెర్రీ(అమెరికా) చేతిలో కంగుతిన్నాడు.

మరిన్ని వార్తలు