యూనిస్, అజహర్ సెంచరీలు పాకిస్తాన్ 323/3

7 May, 2015 01:05 IST|Sakshi

మిర్పూర్ : బంగ్లాదేశ్‌తో బుధవారం ఆరంభమైన రెండో టెస్టు మ్యాచ్‌లో పాకిస్తాన్ శుభారంభం చేసిం ది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 3 వికెట్ల నష్టానికి 323 పరుగులు చేసింది. యూనిస్ ఖాన్ (195 బంతుల్లో 148; 11 ఫోర్లు, 3 సిక్సర్లు), అజహర్ అలీ (258 బంతుల్లో 127 బ్యాటింగ్; 13 ఫోర్లు) శతకాలతో చెలరేగారు.

వీరిద్దరు మూడో వికెట్‌కు 250 పరుగులు జోడించారు. యూనిస్‌కు టెస్టుల్లో ఇది 29వ సెంచరీ కావడం విశేషం. అజహర్‌తో పాటు మిస్బావుల్ హక్ (9 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నాడు. షాహిద్‌కు 2 వికెట్లు దక్కాయి. పాక్‌ను కట్టడి చేసేందుకు ఈ ఇన్నింగ్స్‌లో బంగ్లా తొమ్మిది మంది బౌలర్లను ఉపయోగించింది. రెండు టెస్టుల ఈ  సిరీస్‌లో తొలి మ్యాచ్ డ్రాగా ముగిసింది.

మరిన్ని వార్తలు